
నీలి చిత్రాలతో బ్లాక్ మెయిలింగ్!
విజయవాడ: నగరంలోని కాలేజి విద్యార్థినీలను ట్రాప్ చేస్తున్న ముఠాలోని కొంతమంది సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆరుగురు యువకులు ఓ ముఠాగా ఏర్పడి కాలేజి విద్యార్థినీలను ప్రేమ పేరిట మోసం చేస్తున్న ఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఉన్నత వర్గాలకు చెందిన కాలేజీ అమ్మాయిలను స్నేహాం పేరిట నమ్మించి హోటళ్ళు, పార్టీలు అంటూ విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెడుతున్నారు. ఆ తర్వాత నిర్జీవ ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడ వారితో అసభ్యంగా ప్రవర్తించి సెల్ ఫోన్ లలో ఫోటోలు తీయడం వారి నైజం.
ఒకవేళ అడిగినంత డబ్బు, బంగారం ఇవ్వకపోతే తమతో కలిసి వున్న ఫోటోలను ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో పెడతామని బెదిరిస్తూ అమ్మాయిల దగ్గర నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ఈ ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు ఇప్పటికే ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ ముఠాను విజయవాడ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రేమ పేరుతో యువతులకు మత్తు మందు ఇచ్చినీలి చిత్రాలు తీస్తున్నట్లు నగర కమీషనర్ తెలిపారు. అందుకోసం ఒక రూమ్ లో సెటప్ చేసుకుని.. ఆపై యువతలకు మత్తు మందులు ఇచ్చి నీలి చిత్రాలు తీస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. చెడు స్నేహాలతో అబ్బాయిలు, అమ్మాయిలు మోసపోతున్నారన్నారు. ఈ ముఠానే కాకుండా ఇంకా నగరంలో ఇలాంటివి ఎన్ని ముఠాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు ప్రధానంగా దృష్టి సారించామన్నారు.