
ప్రత్యేక గీతంలో ఊర్మిళ
యాయిరే...యాయిరే...వారెవా ఇది ఏం జోరే... ఈ సాంగ్ అందరికి గుర్తుంటుంది. అప్పట్లో ఈ పాట ఒక సెన్సేషన్. ఏఆర్ రెహమాన్ బీట్‌కు ఊర్మిళ స్టెప్స్ అదిరిపోయాయి. ఊర్మిళ అనగానే అందరికి మొదట గుర్తొచ్చేది ఈ సాంగే . అంతగా పాపులర్ అయింది ఈ సాంగ్. అయితే ఊర్మిళ సినిమాలు మానేసి చాలా ఏళ్లు అవుతోంది.
దాదాపు పది సంవత్సరాల తరువాత ఊర్మిళ మళ్లీ తెరపైకి రాబోతోంది. ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘బ్లాక్‌మెయిల్’ సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో ఊర్మిళ నర్తిస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో సాంగ్ విడుదల కాబోతోంది. దీంతో ఊర్మిళ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మళ్లీ ఇన్నాళ్ల తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఊర్మిళ మ్యాజిక్ చేస్తుందని సినీ అభిమానులు ఆశిస్తున్నారు. అభినయ్ డియో దర్శకత్వం వహించిన బ్లాక్ మెయిల్ సినిమా ఏప్రిల్ 6న విడుదల కాబోతోంది.
ఊర్మిళ 2008 వరకు సినిమాలు చేసింది. 2014లో మొహసిన్ అక్తర్ మీర్ ను పెళ్లి చేసుకుని సినిమా కెరీర్ నుంచి విరామం తీసుకుంది. మళ్లీ దాదాపు 10 ఏళ్ల తర్వాత ఆన్ స్క్రీన్ పైకి వచ్చేస్తోంది రంగీలా బ్యూటీ. ఈ సాంగ్‌పై వర్మ ట్వీట్ చేశాడు. రంగీలా బ్యూటీ ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ అంటూ ట్వీట్ చేశాడు.
Wowwwww👍👍👍 The Rangeela girl is as Rangeeli as ever ..Watch the Forever Green Urmila in https://t.co/p9CKHDRbM8
— Ram Gopal Varma (@RGVzoomin) March 22, 2018
Comments
Please login to add a commentAdd a comment