బాలీవుడ్ నటి కీర్తి కుల్హరి
సాక్షి, ముంబై : కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలలో కొత్తవాళ్లకు అవకాశాలు వస్తున్నా.. ప్రధానమైన హిందీ సినిమాలలో కీలకపాత్రను దక్కించుకోవడం వారికి ఒక పోరాటమేనని బాలీవుడ్ నటి కీర్తి కుల్హరి అన్నారు. ఆదివారం బ్లాక్ మెయిల్ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించారామె. హిందీ పరిశ్రమలో చాలా మార్పు వచ్చిందన్నారు. అయినా కొత్త వాళ్లు తాము గుర్తింపు తెచ్చుకోవడం కష్టమైన పనిగా భావిస్తున్నారాని తెలిపారు. హీరోల పిల్లలకు ఇది చాలా సులభమైన పని పెద్ద నిర్మాణ సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం వాళ్లకు లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
వారి పిల్లలను పెట్టి సినిమాలు తీయడం నిర్మాణ సంస్థలకు సాహసం లాంటిదే కాబట్టి ఎంపిక విషయంలో ఆలోచించి అడుగు వేస్తారని అన్నారు. కొత్త వాళ్లకు ఇది చక్కటి అవకాశం పెద్ద నిర్మాణ సంస్థలో అవకాశం దక్కించుకోవడంతోనే మీరు సగం గుర్తింపు తెచ్చుకుంటారని అన్నారు. మీ సినిమా ఎంత బాగా ఉన్నా అది బాక్సాఫీస్ వద్ద ఎంత బాగా ఆడిందన్న దాని మీదే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. కీర్తి కుల్హరి, ఇర్ఫాన్ ఖాన్ జంటగా నటించిన బ్లాక్ మెయిల్ సినిమా ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment