- ప్రమాణం చేసి చెప్పాలి
- పార్టీలోకి రానివ్వడం లేదనే దయాకర్‌రావు ఆక్రోశం
- ఎంపీని నేను కోన్ కిస్కా అయితే నీవు ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యేవా..
- ఎంపీ కడియం శ్రీహరి
హన్మకొండ సిటీ : టీఆర్‌ఎస్‌లోకి రానివ్వనందుకే టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తనపైన, టీఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వంపై ఆక్రో శం వెళ్లగక్కుతున్నారని వరంగల్ ఎంపీ కడి యం శ్రీహరి అన్నారు. మంగళవారం హన్మకొండ రాంనగర్‌లోని టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడారు.
టీడీపీకీ చెందిన నలుగులు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి సంసిద్ధంగా ఉంటే వారిని అడ్డుపెట్టుకుని తనకు మంత్రి పదవి ఇస్తే మరికొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి వస్తానని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ప్రయత్నించలేదని, అర్థరాత్రి కేసీఆర్‌ను కలవలేదని దేవునిపై కాని, నీవు నమ్మే చిన్నజీయర్‌స్వామిపై కాని ప్రమా ణం చేయాలని, అప్పుడే ప్రజలు నమ్ముతారన్నారు.
వరంగల్ ఎంపీనైన తనను కోన్ కిస్కా అంటే నిన్ను ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యే అనాలా అంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను ఇతర ఎమ్మెల్యేలకు అన్వయించుకోవద్దన్నారు. తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటాను రాకుండా ఏపీ సీఎం అడ్డంకులు సృష్టిస్తున్నారని శ్రీహరి ఆరోపించారు. ఏపీలోని వివిధ పవర్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు రావా ల్సిన 1900 మెగావాట్ల విద్యుత్‌ను ఇచ్చేలా టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేలు చంద్రబాబును ఒప్పించాలన్నారు.
ఢిల్లీకి వెళ్లి సాధించేదేమీ లేదని, ముందుగా విశాఖపట్నం వెళ్లి ఏపీ సీఎంను కలిసి తెలంగాణకు విద్యుత్ ఇవ్వాలని కోరాలని సూచించారు. తెలంగాణను దోపిడీ చేసినందుకు టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలని ఎంపీ సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. తక్కళ్లపల్లి రవీందర్‌రావు, రాజయ్య యాదవ్, భరత్‌కుమార్‌రెడ్డి, సకినాల శోభన్, ఇండ్ల నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.