వరంగల్ లోక్సభ స్థానం నుంచి కడియ శ్రీహరి గెలుపొందారు.
వరంగల్ : వరంగల్ లోక్సభ స్థానం నుంచి కడియ శ్రీహరి గెలుపొందారు. 3.33 లక్షల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ఇక పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుపొందారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి భూపాలపల్లిలో పోటీ చేసిన గండ్ర వెంకటరమణారెడ్డి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి మధుసూధనరెడ్డిపై ఆయన ఓడిపోయారు.