రోల్స్‌ రాయిస్‌ వెడ్డింగ్‌ కారు | Royals Wedding Car: Wedding Planner Remodels Rolls Royce | Sakshi
Sakshi News home page

రోల్స్‌ రాయిస్‌ వెడ్డింగ్‌ కారు

Published Tue, Jul 3 2018 6:48 PM | Last Updated on Tue, Jul 3 2018 7:19 PM

Royals Wedding Car: Wedding Planner Remodels Rolls Royce - Sakshi

హమీద్ ఖాన్ డిజైన్‌ చేసిన రాయల్‌ వెడ్డింగ్‌ కారు

సాక్షి , భోపాల్‌: అంగరంగ వైభవంగా  రాయల్‌లుక్‌లో పెళ్లి చేసుకోవాలనుకునే మధ్యతరగతి వారికి నిజంగా ఇది గుడ్‌న్యూస్‌. అందమైన, ఖరీదైన కారులో ఊరేగాలన్న వధూవరుల కోరికను తీర్చేందుకు ఓ వెడ్డింగ్‌ ప్లానర్‌ కృషి ఇపుడు అందరినీ ఆకట్టుకుంటోంది.  ఖరీదైన రోల్స్‌ రాయిస్‌ కారును అందంగా  పెళ్లి పల్లకిలా రీమోడల్‌ చేశారు.

మధ్య తరగతి జంటలకు వారి పెళ్లి రోజున రాయల్  ఫీలింగ్‌ కలిగించాలనే ఉద్దేశ్యంతో, మధ్యప్రదేశ్‌లోని  భోపాల్‌కు చెందిన హమీద్ ఖాన్ శ్రీకారం చుట్టారు. ఇందుకు  అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్‌ను  పెళ్లి ఊరేగింపునకు అనువుగా , అందంగా పునర్నిర్మించారు. పల్లకిని తలపించేలా సరికొత్తగా డిజైన్ చేశారు. మధ్యతరగతి  వధూవరుల కలలకు ప్రాణం పోస్తూ  కారును డిజైన్ చేసి..దానికి రాయల్స్ వెడ్డింగ్ కారుగా పేరు పెట్టారు.   మధ్యతరగతి జంటలకు గొప్ప అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని రూపొంచినట్టు ఖాన్‌ తెలిపారు.  ఇంకా ధర నిర్ణయించలేదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement