హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వస్త్రాలు, రెడీమేడ్స్ రంగంలో వరంగల్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మాంగళ్య బ్రాండ్ హైదరాబాద్‌కు విస్తరిస్తోంది. మదీనగూడలో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్‌ను ఏర్పాటు చేసింది. జనవరి 3న ఈ ఔట్‌లెట్‌ను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ప్రారంభిస్తారని మాంగళ్య చైర్మన్ కాసం నమశ్శివాయ తెలిపారు. సంస్థ ఫౌండర్ పి.ఎన్.మూర్తి, డైరెక్టర్లు కాసం శివప్రసాద్, పి.అరుణ్‌తో కలిసి మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హన్మకొండ, కరీంనగర్, సిద్దిపేటలో మాంగళ్య మాల్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. మార్చి తొలివారంలో బోడుప్పల్ కేంద్రాన్ని ప్రారంభిస్తాం. ఈ ఏడాదే సూర్యాపేటలో ఇటువంటి సెంటర్ రానుంది. స్వయంవరం, కాసం తదితర బ్రాండ్లలో ఔట్‌లెట్లను నిర్వహిస్తున్నాం. మొత్తం 35 స్టోర్లున్నాయి. 1,500 మంది పనిచేస్తున్నారు. టర్నోవరు రూ.350 కోట్లుంది’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment