ముంబై: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఎఫ్‌ఆర్‌ఎల్) కంపెనీ ఎథ్నిక్ వేర్ బ్రాండ్స్– జేపోర్, టీజీ అప్పారెల్ అండ్ డెకార్‌లను కొనుగోలు చేస్తోంది. జేపోర్ బ్రాండ్‌ను రూ.110 కోట్లకు, టీజీ అప్పారెల్ అండ్ డెకార్ బ్రాండ్‌ను రూ.25 కోట్లకు కొనుగోలు చేయనున్నామని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ తెలిపింది. ఈ డీల్ 30– 45 రోజుల్లో పూర్తవ్వగలదని పేర్కొంది. ఎథ్నిక్ అప్పారెల్, యాక్సెసరీల విభాగంలో మరింత పటిష్టవంతం కావడానికి ఈ బ్రాండ్స్‌ను కొనుగోలు చేస్తున్నామని వివరించింది. 2012లో ఆరంభమైన జేపోర్ బ్రాండ్... చేతితో తయారు చేసిన దుస్తులను, ఆభరణాలను, హోమ్ టెక్స్‌టైల్స్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.39 కోట్ల ఆదాయం ఆర్జించింది. టీజీ అప్పారెల్ అండ్ డెకోర్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.34 కోట్ల టర్నోవర్‌ను సాధించింది.
దేశవ్యాప్తంగా 2,714 బ్రాండ్ స్టోర్స్.....
ఈ రెండు బ్రాండ్ల కొనుగోళ్లతో బ్రాండెడ్ ఫ్యాషన్ స్పేస్‌లో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని ఎబీఎఫ్‌ఆర్‌ఎల్ ఎమ్‌డీ,, అశీష్ దీక్షిత్ పేర్కొన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ఏబీఎఫ్‌ఆర్‌ఎల్ దేశవ్యాప్తంగా 750 నగరాల్లో 2,714 బ్రాండ్ స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. లూయూ ఫిలప్, వాన్ హ్యూసెన్, అలెన్ సోలే, పీటర్ ఇంగ్లాండ్ వంటి బ్రాండ్ల దుస్తులను విక్రయిస్తోంది. పాంటలూన్స్ పేరుతో వేల్యూ ఫ్యాషన్ స్టోర్ బ్రాండ్‌ను కూడా నిర్వహిస్తోంది. ద కలెక్టివ్, టెడ్ బేకర్, రాల్ఫ్ లూరెన్, అమెరికన్ ఈగిల్, సిమన్ కార్టర్ వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్లను కూడా విక్రయిస్తోంది. బ్రాండ్ల కొనుగోళ్ల వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ షేర్ 0.3 శాతం లాభంతో రూ.219 వద్ద ముగిసింది.
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ చేతికి జేపోర్ బ్రాండ్
Published Tue, Jun 11 2019 5:51 AM | Last Updated on Tue, Jun 11 2019 5:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment