
లక్నో: సాధారణంగా షాపింగ్ మాల్స్‌లు కస్టమర్‌లను ఆకట్టుకోవడానికి వినూత్నంగా ఆలోచిస్తుంటాయి. కొన్ని చోట్ల డిస్కౌంట్ సేల్స్, గిప్ట్ కూపన్స్, వన్ ప్లస్ వన్ ఇలా అనేక మార్గాల్లో కస్టమర్‌లను తమ వైపు ఆకర్షితులయ్యేలా చేస్తాయి. ఈ మధ్యకాలంలో మాల్స్‌ల మధ్య విపరీత పోటీ పెరిగింది. అయితే, కొత్త పద్ధతుల్లో కస్టమర్‌లను ఆకట్టుకోవడానికి మాల్స్ నిర్వాహకులు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. వీరి అంతిమ లక్ష్యం మాత్రం కస్టమర్‌లు తమ వైపునకు తిప్పుకోవడమే.
తాజాగా, కోల్‌కతాకు చెందిన ‘సుల్తాన్’ అనే ఒక షాపింగ్ మాల్ నిర్వాహకులు కాస్త వెరైటీగా ఆలోచించారు. ఈ షాపింగ్ మాల్ షేర్వాణి, వివాహ వేడుకల్లో ధరించే సంప్రదాయ దుస్తులకు పెట్టింది పేరు. ఇక్కడ సంప్రదాయ దుస్తులు అనేక వెరైటీల్లో లభిస్తాయి. వీరు స్థానికంగా ఒక పత్రికలో వెరైటీ యాడ్ ఇచ్చారు. సాధారణంగా ఎవరైనా తప్పిపోతే బాధితుల తరుపు వారు మిస్సింగ్ (కనబడుట లేదు) అనే ప్రకటన ఇస్తారనే విషయం మనకు తెలిసిందే.
ఇక్కడ కూడా షాప్ నిర్వాహకులు కూడా ‘మజ్ను మిస్సింగ్’ అంటూ ఒక ప్రకటన ఇచ్చారు. దాని సారాంశం ఏంటంటే.. ‘ మజ్ను.. మీరు దయచేసి ఇంటికి వచ్చేయండి. మీకు నచ్చిన అమ్మాయితోనే మీ వివాహం జరుగుతుంది. అదే విధంగా మీరు ఎంతగానో మెచ్చే ‘సుల్తాన్’ షాపింగ్ మాల్‌లోనే మీ పెళ్లి వేడుక కోసం షాపింగ్ చేద్దాం. ఎప్పటిలాగే షాపింగ్ మాల్స్‌లో అనేక వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. పార్కింగ్ సదుపాయానికి కూడా ఎలాంటి ఇబ్బందిలేదు.
మీకు నచ్చిన షేర్వాణి కొనుక్కుందామంటూ ప్రకటనలో పొందుపర్చారు. అయితే, ప్రకటన పూర్తిగా చదివితేనే ఈ యాడ్ అర్థమవుతుంది. దీన్ని పూర్తిగా చదవని వారు మాత్రం ఎవరో కనిపించకుండా పోయారని భావిస్తారు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వామ్మో.. మీ క్రియేటివిటీకి హ్యట్సాఫ్..’, ‘ఎలా వస్తాయ్ బాబు... ఇలాంటి ఐడియాలు..’, ‘ ఇదో రకం మార్కెటింగ్ స్ట్రాటజీ..’ అంటూ కామెంట్‌లు చేస్తున్నారు.
Such an amazing ad! 😂😂😂 pic.twitter.com/g1fcE0WsJB
— meghnad 🔗 (@Memeghnad) December 27, 2021
చదవండి: కూతురుతో కలిసి అదిరిపోయే స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా
Comments
Please login to add a commentAdd a comment