
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్ లీడ్ రోల్‌లో నటించిన హిట్ మూవీ ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. తొలి భాగాన్ని తెరకెక్కించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ఓదెల గ్రామంలో జరుగుతోంది. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది.
కాశీలో ప్రారంభమైన ఈ సీక్వెల్ చిత్రీకరణ ప్రస్తుతం ఓదెల మల్లన్న క్షేత్రంలో జరుగుతోంది. ఓదెల మల్లన్న ఆలయంతో పాటు గ్రామంలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. తమన్నా, మురళీ శర్మ, హెబ్బా పటేల్, యువ తదితరులు షూట్‌లో పాల్గొంటున్నారు. తన కెరీర్‌లో తొలిసారిగా తమన్నా శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటిస్తున్నారు’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: సౌందర్ రాజన్ .ఎస్, క్రియేటెడ్ బై: సంపత్ నంది.
Comments
Please login to add a commentAdd a comment