
మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia )... గత కొంత కాలంగా ప్రముఖ నటుడు, విలన్ క్యారెక్టర్స్‌కి పేరొందిన విజయ్ వర్మ( Vijay Varma) తో డేటింగ్‌లో ఉన్న విషయం బహిరంగ రహస్యమే. త్వరలో వాళ్లిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారన్నది కూడా తెలిసిన విషయమే. తమన్నా విజయ్ వారి తల్లిదండ్రుల అంగీకారంతో ఈ సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్నారనీ ఈ జంట వివాహానంతరం వారి నివాసం కోసం ముంబైలోని ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్ వెతకడం కూడా పూర్తయిందని ఈ ఏడాది మొదట్లోనే వార్తలు వచ్చాయి.
ఇటీవల ఒక ఇంటర్వూలో సైతం తమన్నా త్వరలో తమ పెళ్లి జరుగనున్నట్టు చెప్పింది.‘పెళ్లికి నా కెరీర్‌కి మధ్య ఎటువంటి సంబంధం లేదు. వివాహం తర్వాత నటనను కొనసాగిస్తాను’ అని కూడా చెప్పింది. కట్ చేస్తే..ఇప్పుడు వారిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారనే వార్త బాలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది. తమ ప్రేమకు ఫుల్‌స్టాప్ పెట్టేసి..మంచి స్నేహితులుగా ఉండటానికి ప్లాన్ చేసుకున్నారని నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే వారిద్దరు విడిపోవడానికి గల కారణాలపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. కెరీర్, పెళ్లి విషయంలో వీరిద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చాయని.. అందుకే విడిపోయారని బీటౌన్‌లో టాక్ నడుస్తోంది.
తమన్నా ప్రస్తుత వయసు 35 ఏళ్లు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్,కోలీవుడ్‌లో పదుస సంఖ్యలు సినిమాలు చేసింది. ఇక సినిమాకు కాస్త గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసుకొని పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేద్దామని తమన్నా భావిస్తోందట. అందుకే చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. అయితే విజయ్‌కి మాత్రం అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదట. కెరీర్ పరంగా ఇంకా ఎదగాలని.. కొన్నాళ్ల పాటు సినిమాలపైనే ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడట. ఈ విషయంలో ఇద్దరికి గొడవ జరిగి.. చివరకు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారట.
హ్యాపీడేస్ తో సినీరంగానికి పరిచయమైన తమన్నా భాటియా అంచలంచెలుగా ఎదుగుతూ ఇండియన్ స్క్రీన్ మీద తనదైన ముద్ర వేస్తోంది. ఇటీవలే హాట్ గా కనిపించడానికి, ఎక్స్‌పోజింగ్‌కు సైతం తమన్నా సై అంటుండడంతో ఇప్పటికీ ఆమెకి అవకాశాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా విడుదలై ఘన విజయం సాధించిన స్త్రీ 2లోని తమన్నా ఐటమ్ సాంగ్ ఆజ్ కీ రాత్... ఉత్తరాదిని ఊపేసింది. ఇక మన హైదరాబాద్‌కు చెందిన నటుడు విజయ్ వర్మతో 2023లో లస్ట్ స్టోరీస్ 2లో కలిసి స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు.
అప్పటికే ఇద్దరూ డేటింగ్ చేస్తుండడంతో...ఆ లస్ట్ స్టోరీస్‌లో తమన్నా తొలిసారి శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది కూడా. ఆ తర్వాత వారిద్దరూ తమ సంబంధాన్ని పబ్లిక్‌గా మార్చారు. అనేక పబ్లిక్, రెడ్ కార్పెట్ ప్రదర్శనలు, విహారయాత్రలు జంటగా కొనసాగించారు, వవృత్తిపరంగా ఒకరికొకరు మద్దతు ఇవ్వడమే కాకుండా చాలా మందికి అభిమాన జంటగా ఎదిగారు. అలాంటి వీరిద్దరూ అకస్మాత్తుగా బ్రేకప్ చెప్పుకోవడం అభిమానుల్ని షాక్‌కి గురి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment