
ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్టశక్తుల నుంచి ఏ విధంగా రక్షిస్తాడు? అనే ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల 2’. 2022లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. ఇందులో తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ పై డి. మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది క్రియేటర్‌గా ఉన్న ఈ సినిమా ప్రారంభోత్సవం కాశీలో జరిగింది.
రెగ్యులర్ షూటింగ్‌ని కూడా కాశీలోనే ఆరంభించారు. తొలి సీన్‌కి సంపత్ నంది క్లాప్ కొట్టారు. ‘‘ఓదెల 2’ గ్రామం చుట్టూ కేంద్రీకృతమై, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా రక్షిస్తాడనే అంశాలతో ఈ చిత్రకథ ఉంటుంది. క్యాస్టింగ్, కథ, వీఎఫ్‌ఎక్స్.. టోటల్‌గా మేకింగ్ పరంగా ఈ చిత్రం పెద్దగా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: సౌందర్ రాజన్. ఎస్.
Comments
Please login to add a commentAdd a comment