
సాక్షి, హైదరాబాద్: ‘అ, కల్కి’ వంటి చిత్రాల తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. యాపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై రాజ్‌శేఖర్ వర్మ నిర్మించారు. ఈ సినిమాలో హీరోగా ఎవరు నటించారనే సస్పెన్స్‌కు తెరదించుతూ ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌లను చిత్రబృందం విడుదల చేసింది. బాల నటుడిగా అందరి ప్రశంసలు పొంది, సమంత లీడ్ రోల్ చేసిన ‘ఓ బేబీ’లో ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్న తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి’తో హీరోగా పరిచయమవుతున్నాడు.
నేడు తన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో తేజ గద పట్టుకొని ఉండగా, జాంబీలు అతనిపై దాడి చేయబోతున్నట్లు కనిపిస్తోంది. ఇక మోషన్ పోస్టర్ విషయానికి వస్తే.. తన వెనకవైపు చిరంజీవి బొమ్మ ఉన్న షర్ట్ ధరించి స్టైల్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు తేజ. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్ , కెమెరా: అనిత్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటì .