
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘అ’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా హనుమాన్ అనే సూపర్ హీరో మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. ఈ మూవీ అనంతరం ప్రశాంత్ వర్మ మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు.
పది మంది హీరోయిన్లతో డిఫరెంట్ సబ్జెక్ట్‌తో కథ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ను సంప్రదించడం, ఆమె ఓకే చేయడం చకాచకా జరిగిపోయాయని తెలుస్తుంది. మిగతా హీరోయిన్స్ కూడా పాపులారిటీని బట్టి తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment