ఇది పాన్ వరల్డ్ చిత్రం ‘‘మన తెలుగు సినిమాలు ‘ఆర్‌ఆర్‌ఆర్, కార్తికేయ 2’ పాన్ వరల్డ్ వెళుతున్నాయి. మా ‘హనుమాన్’ కూడా పాన్ వరల్డ్ ఫిల్మ్. తమిళ, హిందీ, మలయాళం, కన్నడ ప్రేక్షకులు కూడా ఇది తమ సినిమా అని భావించేలా ఉంటుంది’’ అని ప్రశాంత్ వర్మ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా నటించిన చిత్రం ‘హనుమాన్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.
చదవండి: అదిరిపోయిన 'హనుమాన్' టీజర్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ
ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమంలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ‘‘నాకు చిన్నప్పటి నుండి ఇష్టమైన హనుమాన్ పేరుతో ఇంత పెద్ద సినిమా చేయడం హ్యాపీగా ఉంది. అనుకున్న బడ్జెట్ కంటే ఆరింతలు ఎక్కువ అయినా నిరంజన్ రెడ్డిగారు రాజీపడలేదు. పౌరాణిక పాత్ర అయిన హనుమాన్‌పై తొలిసారి పూర్తి స్థాయి సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు. తేజ సజ్జా మాట్లాడుతూ.. ‘‘స్పైడర్ మాన్, సూపర్ మాన్ ఫిక్షనల్ హీరోలు. కానీ, హనుమాన్ మన చరిత్ర. అలాంటి గొప్ప దేవుడు హనుమంతుడి అనుగ్రహంతో ఒక కుర్రాడికి సూపర్ పవర్ వస్తే ఏం చేస్తాడు? అనేది ఈ సినిమా’’ అన్నారు. ‘‘హనుమాన్’తో త్వరలోనే థియేటర్‌లో కలుద్దాం’’ అన్నారు అమృత.
చదవండి: జబర్దస్త్ ‘పంచ్’ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే?
Comments
Please login to add a commentAdd a comment