సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా నేడు (జనవరి 12న) విడుదలైన హనుమాన్ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఒకరోజు ముందే అంటే నిన్ననే భారీగా ప్రీమియర్ షోలు పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ పాజిటివ్‌గానే రియాక్ట్ అవుతున్నారు. తెలుగులో 'సూపర్‌మ్యాన్' జోనర్ చిత్రాలు రావడం చాలా అరుదు. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రంతో ఆ లోటు తీర్చడమే కాదు.. ఏకంగా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు.
ఇందులో కథానాయకుడు తేజ సజ్జా రోల్ చాలా చక్కగా ఉంటుంది. తనలోని ఉన్న టాలెంట్ మొత్తాన్ని ఈ సినిమా కోసం ఉపయోగించాడు. అందుకే అతను తెరపై కనిపించినప్పుడు విజిల్స్ పడుతున్నాయి. ముఖ్యంగా చాలా తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన సినిమాను ప్రశాంత్ వర్మ తీశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ 5 దక్కించుకుంది. పాన్ ఇండియా రేంజ్‌కు తగ్గట్లు సినిమా ఉండటంతో ఓటీటీ రైట్స్ భారీ ధరకే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. సినిమాకు హిట్ టాక్ రావడంతో ఓటీటీలోకి వచ్చేందుకు కాస్త ఎక్కువ సమయమే పడవచ్చని సమాచారం.
(ఇదీ చదవండి: Hanu Man Review : ‘హను-మాన్’ మూవీ రివ్యూ)
ఏదేమైనా మార్చి నెలలో హనుమాన్ ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉన్నట్లు సినిమా ఎండ్ కార్డ్‌లో ఉంటుంది. 2025లో జై హనుమాన్ పేరుతో పార్ట్-2 వస్తుందని దర్శకుడు ప్రకటించాడు. తేజ సజ్జ, అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్,సముద్రఖని వంటి నటీనటులు హనుమాన్‌లో నటించారు. చిన్న సినిమాగా మొదలైనప్పటికీ క్రమంగా స్కేల్‌ని పెంచుకొని 12 భాషల్లో విడుదల అయ్యేలా ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు. పెద్ద సినిమాలకు దీటుగా సంక్రాంతి బరిలో హనుమాన్ నిలిచి హిట్ టాక్‌తో దూసుకుపోతున్నాడు.
ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లంటే..
హనుమాన్ సినిమాపై విడుదల ముందు నుంచే భారీ క్రేజ్ ఏర్పడింది. ఓటీటీ హీందీ వర్షన్ రూ. 5కోట్లు, తెలుగు వర్షన్ రూ. 11 కోట్లకు హనుమాన్‌కు సంబంధించిన హక్కులు అమ్ముడుపోయాయి. ప్రముఖ ఎంటర్‌టైనింగ్ సంస్థ 'జీ5' ఈ హక్కుల్ని దక్కించుకుంది. ఓ యువ హీరో నాలుగో సినిమానే ఇంత భారీ ధర పలకటం విశేషమని అప్పట్లో సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి నిర్మాతగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment