హనుమాన్ సినిమా హిట్‌తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ట్రెండింగ్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లతో దూసుకెళ్తోంది ఈ చిత్రం. హనుమాన్ విజయంతో దానికి సీక్వెల్‌గా జై హనుమాన్ చిత్రం ఉంటుందని ఇప్పటికే ఆయన ప్రకటించాడు.
జై హనుమాన్ చిత్రాన్ని ఉద్దేశించి తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సీక్వెల్‌లో తేజ హీరో కాదని ఆయన తేల్చి చెప్పారు. సూపర్ హీరో కథలకు ఇతిహాసాలలోని దేవుళ్లకు ముడిపెట్టి తెరకెక్కించేందుకు తన వద్ద 12 కథలు ఉన్నాయని ప్రశాంత్ వర్మ చెప్పిన విషయం తెలసిందేజ ఈ క్రమంలో వచ్చిన చిత్రమే 'హను-మాన్'. దీనికి రానున్న సీక్వెల్ హను-మాన్ కంటే వందరెట్లు భారీ స్థాయిలో 'జై హనుమాన్' ఉంటుందని ఆయన తెలిపారు. కానీ సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదు.. కానీ, అందులో హనుమంతు పాత్రలో మాత్రమే కనిపిస్తాడని చెప్పాడు.
సీక్వెల్‌లో హీరో ఆంజనేయ స్వామి అని ఆ పాత్రలో ఒక స్టార్ హీరో కనిపిస్తారని ఆయన పేర్కొన్నాడు. జై హనుమాన్ చిత్రం 2025లో కచ్చితంగా విడుదల చేస్తామని ప్రశాంత్ తెలిపాడు. ఈలోపు తను డైరెక్ట్ చేసిన అధీర,మహాకాళీ విడుదల అవుతాయని క్లారిటీ ఇచ్చాడు. హనుమాన్ సీక్వెల్‌లో రామ్ చరణ్ నటించనున్నాడని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. మరికొన్ని రోజుల్లో ఆ స్టార్ హీరో ఎవరో క్లారిటీ రానుంది.
Comments
Please login to add a commentAdd a comment