ఫ్యాన్స్‌కు హనుమాన్ టీం సర్‌ప్రైజ్‌.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! | Prashanth Varma Hanu Man Movie Streaming On This Ott Goes Viral | Sakshi
Sakshi News home page

Hanu Man Movie: ఓటీటీకి హనుమాన్.. తొలిసారి అలాంటి షాకింగ్‌ నిర్ణయం!

Published Fri, Mar 8 2024 9:27 PM | Last Updated on Sat, Mar 9 2024 7:04 AM

Prashanth Varma Hanu Man Movie Streaming On This Ott Goes Viral - Sakshi

సంక్రాంతి బ్లాక్‌ బస్టర్ హిట్ మూవీ హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేటర్లలో ఇంకా రన్ అవుతూనే ఉంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సూపర్‌ హిట్‌ కావడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఓటీటీకి వస్తుందని భావించినప్పటికీ అలా జరగలేదు. 

తాజాగా ఓటీటీ రిలీజ్‌పై మరో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. హనుమాన్ మూవీ ఈనెల 16 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వస్తుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. ఈ సినిమాను జియో సినిమాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా కలర్స్ సినీఫ్లెక్స్‌ ఛానెల్‌లో మార్చి 16 రాత్రి ఎనిమిది గంటలకు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. దీంతో బాలీవుడ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే సౌత్‌ భాషల్లో స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తెలుగు ఆడియన్స్‌తో పాటు సౌత్‌ ఫ్యాన్స్‌ హనుమాన్ ఓటీటీ రిలీజ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement