టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాల హడావుడి మొదలైపోయింది. 'హను-మాన్', 'గుంటూరు కారం' చిత్రాలు థియేటర్లలోకి వచ్చేశాయి. రెండింటిని పోల్చి చూసుకుంటే చాలామంది 'హను-మాన్' వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో రెమ్యునరేషన్ టాపిక్ మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ 'హను-మాన్' టీంలో ఎవరికెంత ఇచ్చారు?
'హను-మాన్' టాక్ ఏంటి?
ఈసారి సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు నిలిచాయి. వీటిలో చాలామంది మహేశ్ 'గుంటూరు కారం' హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ దీనికంటే బెటర్ రివ్యూస్ ఇప్పుడు 'హను-మాన్' మూవీకి వస్తోంది. సూపర్ హీరో కాన్సెప్ట్, ఆంజనేయుడి సెంటిమెంట్‌తోపాటు కంటెంట్ కూడా భలే క్లిక్ అయింది. గురువారం సాయంత్రం ప్రీమియర్స్ పూర్తవగానే.. అందరూ 'జై హనుమాన్' నామజపం చేస్తున్నారు.
(ఇదీ చదవండి: Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ)
అదే టైంలో దర్శకుడు ప్రశాంత్ వర్మని మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే కేవలం రూ.55 కోట్ల బడ్జెట్‌తో ఈ రేంజు సినిమా తీశాడంటే.. మరికాస్త బడ్జెట్ ఇచ్చుంటే వేరే లెవల్ మూవీ తీసేవాడని అనుకుంటున్నారు. సరే ఇది పక్కనబెడితే ఈ మూవీకి నటీనటులకు ఇచ్చిన రెమ్యునరేషన్.. రూ.10 కోట్లు కూడా దాటలేదనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.
'హను-మాన్' సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జా.. సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి గానూ ఇతడికి రూ.2 కోట్లు ఇచ్చారట. దర్శకుడు ప్రశాంత్ వర్మ.. రూ.70 లక్షల నుంచి రూ.కోటి మధ్య పారితోషికం అందుకున్నాడట. మిగతా నటీనటుల్లో హీరోయిన్ అమృత అయ్యర్-రూ 1.5 కోట్లు, వరలక్ష‍్మీ శరత్ కుమార్ రూ. కోటి, వినయ్ రాయ్ రూ.65 లక్షలు, వెన్నెల కిశోర్ రూ.55 లక్షలు, గెటప్ శీను రూ.35 లక్షలు అనే టాక్ వినిపిస్తుంది. మిగతా నటీనటులకు కాస్తోకూస్తే ఇచ్చారు. మొత్తంగా చూసుకుంటే రూ.10 కోట్ల లోపే రెమ్యునరేషన్ తేల్చేశారనమాట.
(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు మూవీ)
Comments
Please login to add a commentAdd a comment