రూ.100 కోట్ల వసూళ్లు దాటేసిన 'హనుమాన్'.. ఆ విషయమైతే చాలా స్పెషల్ | Hanu Man Movie Worldwide Box Office Collections Crossed 100 Crores, Creates New Record - Sakshi
Sakshi News home page

Hanu-Man Movie Collections: 'హనుమాన్' సంక్రాంతి విన్నర్‌.. మొత్తానికి అనుకున్నది సాధించేశారు!

Published Tue, Jan 16 2024 3:18 PM | Last Updated on Tue, Jan 16 2024 4:29 PM

Hanu Man Movie Collection Worldwide Cross 100 Crores New Record - Sakshi

చిన్న సినిమా అన్నారు. అలానే న్యాయం జరుగుతుందని చెప్పారు. దీనికి తోడు సరిపడా థియేటర్లు దొరకలేదు. అయితేనేం 'హనుమాన్' చిత్రబృందం అనుకున్నది సాధించింది. ఎవరూ ఊహించని విధింగా కలెక్షన్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. తాజాగా సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసినట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే సినిమా పలు రికార్డులు క్రియేట్ చేయడం విశేషం.

తేజసజ్జా-ప్రశాంత్ వర్మ కాంబోలో తీసిన 'హనుమాన్'.. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తీశారు. అయితే సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉండటంతో తొలుత తప్పుకోమని సలహాలు ఇచ్చారు. కానీ కంటెంట్ మీద నమ్మకంతో బలంగా నిలబడ్డారు. థియేటర్లు సరిపడా ఇవ్వకపోయినా సరే హిట్ కొట్టి తీరతామని నమ్మారు. ఇప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల సందడి.. ఏది హిట్? కలెక్షన్స్ ఎంత?)

కేవలం రూ.55 కోట్లతో తీసిన 'హనుమాన్' సినిమాకు.. జస్ట్ నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. బెన్‌ఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి దక్షిణాదిలో ఓ మాదిరి వసూళ్లు వచ్చినప్పటికీ నార్త్, ఓవర్సీస్‌లో అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. 

బాక్సాఫీస్ దగ్గర నిలకడగా సరాసరి రూ.25 కోట్ల వరకు సాధిస్తూ వెళ్తున్న ఈ చిత్రం.. రూ.100 కోట్ల మార్క్ దాటేయడం మామూలు విషయం కాదు. అలానే నార్త్ అమెరికాలోనూ 3 మిలియన్ డాలర్లు సాధించి... ఓవర‍్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇది మాత్రం 'హనుమాన్' టీమ్‌కి చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఇక నాలుగు రోజుల్లో ఈ రేంజు వసూళ్లు వచ్చాయంటే.. లాంగ్ రన్‌లో రూ.300-400 కోట్లు వచ్చినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement