ఆ పాత్రలకు టాలీవుడ్‌ స్టార్ హీరోలు.. ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్! | Hanuman Director Prashanth Varma Interesting Comments On Jai Hanuman Project, Deets Inside - Sakshi
Sakshi News home page

Prashanth Varma On Chiranjeevi, Mahesh Babu: హనుమాన్‌గా మెగాస్టార్.. రాముడిగా మహేశ్‌: ప్రశాంత్‌ వర్మ కామెంట్స్ వైరల్!

Published Tue, Jan 30 2024 9:27 PM | Last Updated on Wed, Jan 31 2024 9:55 AM

Hanuman Director Prashanth Varma comments On Jai Hanuman Project - Sakshi

హనుమాన్‌ మూవీతో బ్లాక్‌బాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ ‍వర్మ. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన  హనుమాన్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రం రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇదే జోరులో మరో చిత్రానికి రెడీ అవుతున్నారు ప్రశాంత్ వర్మ. త్వరలోనే తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్ జై హనుమాన్‌ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హనుమంతుడు, రాముడి పాత్రలకు ఎవరు చేస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రశాంత్‌ వర్మ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పాత్రలకు స్టార్‌ హీరోలు నటించే అవకాశముందని తెలిపారు. 

ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..'జై హనుమాన్‌ మూవీ స్కేల్‌ చాలా పెద్దది. ఈ చిత్రంలో పెద్ద స్టార్స్ నటించే అవకాశం ఉంది. హనుమంతుడి పాత్ర ఎవరు చేసినా హావభావాల విషయంలో ఎలాంటి ఇబ్బంది కనిపించదు. ఆ పాత్ర మనం బయట చూసే హనుమాన్‌లా ఉండదు. ఆయన ఏ రూపంలోనైనా కనిపిస్తారు. హనుమాన్‌ పాత్ర కోసం బాలీవుడ్‌ నటులు రెడీగా ఉన్నారు. అయితే చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలగాలి. ఆ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండొచ్చు. మెగాస్టార్‌కు పద్మవిభూషణ్‌ వచ్చిన తర్వాత నేను కలవలేదు. అన్నీ కుదిరితే చిరంజీవి ఆ పాత్ర చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో ముందు ఏం జరగబోతోందో ఇప్పుడే చెప్పలేం. రాముడిగా నా మనసులో ఉన్న నటుడైతే మహేశ్‌బాబు. ఎందుకంటే సోషల్‌మీడియాలో రాముడిగా క్రియేట్‌ చేసిన మహేశ్ బాబు ఫొటోలను చూశా. మా ఆఫీస్‌లో కూడా ఆయన ముఖంతో రీక్రియేట్‌ చేసి చూశాం' అని అన్నారు. 

అంతే కాకుండా జై హనుమాన్‌ చిత్ర పనులు ఏడాది కిందటే మొదలు పెట్టామని ప్రశాంత్ వర్మ తెలిపారు. కథ సిద్ధంగా ఉందని.. ఎలా తీయాలో అన్న విషయంపై ఇంకా వర్క్ జరుగుతోంది. వీఎఫ్‌ఎక్స్‌తో పాటు మిగిలిన వాటిపై ఓ క్లారిటీ రాగానే షూటింగ్‌ మొదలవుతుందన్నారు. రాబోయే సినిమాల నాణ్యత విషయంలో అస్సలు రాజీపడది లేదని ప్రశాంత్‌ వర్మ చెప్పుకొచ్చారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement