![RRR Movie Release DVV Danayya Son Kalyan Adhira Movie First Strike - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/23/adhira-movie.jpg.webp?itok=HY6yXdSB)
ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ హీరోగా త్వరలో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్యాణ్ హీరోగా అధీర అనే మూవీ తెరకెక్కనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను డైరెక్టర్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు విడుదల చేశారు. ఈ ‘అధిర ఫస్ట్ స్ట్రైక్’ను హాలీవుడ్‌లో రెంజ్‌లో విజువల్ ఎఫెక్ట్స్‌ను చూపించారు.
చూస్తుంటే మరో సూపర్ హీరో సినిమాను ప్రశాంత్ వర్మ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి గౌరీహరి సంగీతం అందిస్తుండగా, దాశరధి శివేంద్ర కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment