తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, అమృతా అయ్యర్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలైన తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది హనుమాన్ మూవీ. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్‌తో అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
హనుమాన్ మూవీకి బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ఎప్పుడో సాధించేసింది. తాజాగా ఇప్పటి వరకు హనుమాన్ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.. కేవలం 25 రోజుల్లో రూ. 300 కోట్లు రాబట్టి ఇండియన్ సినిమా హిస్టరీలోనే రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికి హనుమాన్ సినిమా కలెక్షన్లు భారీగానే కొనసాగుతున్నాయి. ఈ స్పీడ్ చూస్తుంటే మరో రూ. 50 కోట్లు రాబట్టవచ్చని సినీ ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు.
మరోవైపు సంక్రాంతి సమయంలో విడుదలైన చిత్రాల్లో ఇప్పటి వరకు అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా హనుమాన్ రికార్డులకెక్కింది. 92ఏళ్ళ సినీ చరిత్రలో.. ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ సంక్రాంతికి వచ్చాయి. ఆ చిత్రాలు అన్నిటిని హనుమాన్ బీట్ చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'జై హనుమాన్' రానుంది. కొన్ని రోజుల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయినట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలోని ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు. 'ఆన్‌స్క్రీన్‌తో పాటు, ఆఫ్ స్క్రీన్‌లోనూ వారి ఇమేజ్ సరిపోవాలి. చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలగాలి. ఆ జాబితాలో చిరంజీవి సర్ కూడా ఉండొచ్చు.' అని ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ చెప్పారు. రాముడిగా మహేశ్‌బాబు అయితే సరిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఆయన్ను రాముడిగా క్రియేట్ చేసిన ఫొటోలను చూశానని, తమ ఆఫీస్‌లో కూడా రాముడి పాత్రను మహేశ్ ముఖంతో రీక్రియేట్ చేసి చూసినట్లు ఆయన తెలిపారు. పార్ట్ 1లో నటించిన తేజ కూడా పార్ట్ 2లో కనిపిస్తారని ఆయన చెప్పిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment