
‘అ!’ ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కల్కి. గరుడవేగ సినిమా సక్సెస్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. అందులో భాగం ఈ రోజు టీజర్‌ను రిలీజ్ చేశారు.
1983 నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. గ్రాండ్ విజువల్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్బ్ అనిపించేలా ఉన్నాయి. నిర్మాత సీ కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అదాశర్మ, నందితా శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment