శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇదే సమయంలో టాలీవుడ్‌లో విడుదలైన హనుమాన్ చిత్రం ఖాతాలో భారీ రికార్డ్ చేరింది. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ చిత్రం నేడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‌ల సునామీ క్రియేట్ చేస్తుంది. సంక్రాంతి కానుకగా కేవలం రూ. 50 కోట్లతో తెరకెక్కిన హనుమాన్ చిత్రం ఎవరూ ఊహించని వసూళ్లు సాధిస్తోంది. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
2024లో రూ.200 కోట్ల మార్క్ అందుకున్న తొలి భారతీయ సినిమాగా హను- మాన్ రికార్డు కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్‌లో దుమ్మురేపింది. నార్త్ ఇండియాలో ఎక్కడ చూసినా కూడా అయోధ్య రాముడు, హనుమాన్ ఈ రెండే పేర్లు మారుమ్రోగుతున్నాయి.
ఒక టికెట్ కొంటే ఇంకొకటి ఉచితం
నేడు (జనవరి 22) అయోధ్యలో రామ మందింరం ప్రారంభోత్సవం సందర్భంగా యూఎస్ఏలో (USA) పలు ప్రాంతాల్లో ఎంపిక చేసిన స్క్రీన్స్‌లలో సగం ధరకే టికెట్ విక్రయిస్తున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. అంతే కాకుండా ఇండియాలో కూడా మిరాజ్ సినిమాస్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. నేడు ఒక్కరోజు హనుమాన్ సినిమాకు 'బై వన్ గెట్ వన్'(ఒకటి కొంటే ఇంకొకటి ఉచితం) ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
బుక్ మైషోలో 'MIRAJBOGO' అనే కోడ్ ఉపయోగించి ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా హీరోగా, అమృత అయ్యార్ హీరోయిన్గా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్‌తో పాటు సముద్రఖని, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ వంటి తదితురులు కీలక పాత్ర పోషించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నైజాం ఏరియాలో మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని పంపిణీ చేశారు.
जय श्री राम 🙏
— Mythri Movie Makers (@MythriOfficial) January 22, 2024
With the divine blessings of Lord Shree Ram, #HanuManRAMpage continues to soar higher at the Box-office ❤️🔥
2️⃣0️⃣0️⃣ CRORE WORLDWIDE collections for #HANUMAN in just 10 Days 🔥💥
Nizam Release by @MythriOfficial ❤️🔥
A @PrasanthVarma film
🌟ing @tejasajja123… pic.twitter.com/S1gjf0RKYr
Comments
Please login to add a commentAdd a comment