రెండేళ్ల క్రితం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘అ!’ చిత్రం ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించింది. వాల్‌పోస్టర్ సినిమా పతాకంపై హీరో నాని ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా సీక్వెల్‌ను ఆశించారు కొందరు ప్రేక్షకులు. ఇప్పుడు ‘అ!’ సీక్వెల్ స్క్రిప్ట్‌ను పూర్తి చేసినట్లు వెల్లడించారు ప్రశాంత్ వర్మ. ‘‘అ! 2’ కోసం నన్ను అడుగుతూ, ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నవారందరికీ ధన్యవాదాలు. దాదాపు ఏడాది క్రితమే ‘అ! 2’ స్క్రిప్ట్‌ను పూర్తి చేశాను. ఇది ‘అ!’ కన్నా క్రేజీగా ఉంటుంది. కథ అంతకు మించి ఉంటుంది. కానీ సెట్స్‌పైకి తీసుకువెళ్లలేకపోతున్నాను. ఎందుకుంటే స్క్రిప్ట్‌లోని క్రేజ్‌నెస్‌కి తగ్గ క్రేజీ ప్రొడ్యూసర్ కుదరడం లేదు. నన్ను నమ్మండి. ప్రయత్నించి చాలా అలసిపోయాను. కాబట్టి జరగాల్సినప్పుడే అది (‘అ!2’ షూటింగ్‌ను ఉద్దేశించి) జరుగుతుంది’’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు ప్రశాంత్‌వర్మ.
Comments
Please login to add a commentAdd a comment