Awe Movie
-
గతంలోకి వెళ్లాలనుందా..? ఈ సినిమాలు చూసేయండి..
Telugu Time Travel Movies And Web Series: భారతీయ సినీ ప్రపంచంలో అనేక రకాల సినిమాలు వచ్చాయి. అందులో ఎన్నో రకాల జోనర్లు ఉన్నాయి. అది ఏ జోనరైనా సరే ఆ జోనర్‌కు తగినట్టు చూపిస్తే చాలనుకుంటాడు సగటు సినీ ప్రేమికుడు. అలా ప్రేక్షకులు నచ్చే మెచ్చే జోనర్లలో ఒకటి 'టైమ్ ట్రావెల్' జోనర్. కాలంతో పాటు ప్రయాణం చేసే కథలు చాలా అరుదుగానే వస్తుంటాయి. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సినిమాలు చేయడం అంటే అంతా ఆశామాషీ కాదు. దానికి అద్భుతమైన స్క్రిప్ట్, బోలెడంత బడ్జెట్‌తో పాటు ప్రేక్షకుడిని కన్విన్స్ చేసేలా కూడా ఉండాలి. అందుకే చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే ఈ టైమ్ ట్రావెల్ కథలతో సినిమాలు చేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369' నుంచి ఇటీవల వచ్చిన అద్భుతం సినిమా వరకు అలరించిన టైమ్ ట్రావెల్ చిత్రాలను చూద్దాం. 1 - ఆదిత్య 369 నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఆదిత్య 369 చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలోనే తొలి టైమ్ ట్రావెల్ చిత్రం. ఇందులో కృష్ణ కుమార్, శ్రీ కృష్ణదేవరాయలుగా రెండు పాత్రల్లో బాలకృష్ణ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆగస్టు 18, 1991లో విడుదలైన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను హాలీవుడ్ చిత్రం 'బ్యాక్ టూ ఫ్యూచర్', హెచ్.జి. వెల్స్ రచించిన 'టైమ్ మేషీన్' పుస్తకం నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. 2 - 24 తమిళ స్టార్ హీరో సూర్య మూడు విభన్న పాత్రలతో మెప్పించిన చిత్రం 24. ఈ సినిమాను వైవిధ్య చిత్రాల దర్శకుడు కె. విక్రమ్ కుమార్ తెరకెక్కించారు. సమంత హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వాచ్ రిపేరర్, సైంటిస్ట్, విలన్‌గా సూర్య అదరగొట్టారు. ఇందులో వాచ్ రూపంలో టైమ్ మేషీన్ ఉంటుంది. ఆ వాచ్‌ను రిపేర్ చేసే క్రమంలో టైమ్ మేషీన్ ద్వారా సూర్య గతంలోకి ప్రవేశిస్తాడు. 3- ప్లే బ్యాక్ గతం నుంచి ప్రస్తుతానికి ఒక ఫోన్ లైన్ ద్వారా కనెక్షన్ ఏర్పడితే ఎలా ఉంటుందనేదే 'ప్లే బ్యాక్' సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వద్ద పనిచేసిన హరిప్రసాద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో దినేష్, అనన్య ప్రధానపాత్రల్లో నటించారు. వీరిలో ఒకరు 1993లో బ్రతికుంటే, మరొకరు 2019 కాలంలో జీవిస్తూ ఉంటారు. అయితే 26 ఏళ్ల టైమ్ గ్యాప్ ఉన్న ఈ పాత్రల మధ్య సంబంధం ఏంటీ ? ఫోన్ కాల్స్ ద్వారా గతంలో జరిగిన సంఘటనలో మార్పు తీసుకొస్తే ప్రస్తుతం, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో అని తెలిపేదే కథ. ఈ సినిమా ప్రస్తుతం 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 4 - అద్భుతం తేజ సజ్జా, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో మాలిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం అద్భుతం. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న ఇద్దరు ఒక ఫోన్ కాల్‌తో విరమించుకుంటారు. అయితే ఇద్దరికీ ఒకే మొబైల్ నంబర్‌తో ఫోన్ కాల్ వస్తుండంతో ఆశ్చర్యానికి గురవుతారు. ఇలా ప్రారంభమైన సినిమా వాళ్లిద్దరూ వేరు వేరు సంవత్సరంలో జీవిస్తున్నారని తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ మూవీలో 26 సంవత్సరాలు టైమ్ గ్యాప్ ఉంటే ఇందులో ఐదేళ్ల గ్యాప్ ఉంటుంది. గతంలో జరిగిన సంఘటనలను మార్చే నేపథ్యంతో సాగుతుందీ సినిమా. ఈ చిత్రం నవంబర్ 19, 2021లో హాట్‌స్టార్‌లో విడుదలైంది. 5 - ఆ ! దర్శకుడిగా ప్రశాంత్ వర్మ తొలి చిత్రం ఆ !. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హీరో నాని, ప్రశాంత్ తిపిర్నేని నిర్మించారు. ఇందులో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, రెజీనా కసాండ్ర, శ్రీనివాస్ అవసరాల, ప్రియ దర్శిని, మురళి శర్మ నటించగా, రెండు పాత్రలకు నాని, రవితేజ వాయిస్ ఇచ్చారు. అయితే ఈ సినిమా పూర్తి తరహా టైమ్ ట్రావెల్ చిత్రం కాదు. కానీ ఇందులో వాచ్మెన్ శివ పాత్ర సైంటిస్ట్ అవ్వాలనుకుంటాడు. సైంటిస్ట్ అయి టైమ్ మేషీన్ కనిపెట్టి ఎప్పుడూ చూడని తన తల్లిదండ్రులను కలవాలనుకుంటాడు. ఈ క్రమంలో అతని దగ్గరికి భవిష్యత్తు నుంచి పార్వతి అనే పాత్ర వస్తుంది. ఇలా ఈ పాత్రల ద్వారా టైమ్ ట్రావెల్‌ను చూపించాడు దర్శకుడు. అయితే పార్వతికి, శివకు ఉన్న రిలేషన్ ఏంటనేది మాత్రం సినిమాలో బెస్ట్ ట్విస్ట్. 6 - కుడి ఎడమైతే టైమ్ ట్రావెల్ జోనర్లో వచ్చిన వెబ్ సిరీస్ కుడి ఎడమైతే. అమలాపాల్, ఈశ్వర్ రచిరాజు, రాహుల్ విజయ్ నటించిన ఈ వెబ్ సిరీస్‌లో టైమ్ లూప్ (Time Loop) గురించి వివరించారు. ఒకే సమయంలో ఆగిపోవడం. అంటే పాత్రలు, సంభాషణలు, సంఘటనలు రిపీట్ అవుతుంటాయన్నమాట. మల్టీపుల్ స్క్రీన్ ప్లే, కొత్త తరహా కథతో ఆకట్టుకున్నాడు దర్శకుడు పవన్ కుమార్. -
‘ఇది ‘అ!’ కన్నా క్రేజీగా ఉంటుంది కానీ..’
రెండేళ్ల క్రితం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘అ!’ చిత్రం ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించింది. వాల్‌పోస్టర్ సినిమా పతాకంపై హీరో నాని ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా సీక్వెల్‌ను ఆశించారు కొందరు ప్రేక్షకులు. ఇప్పుడు ‘అ!’ సీక్వెల్ స్క్రిప్ట్‌ను పూర్తి చేసినట్లు వెల్లడించారు ప్రశాంత్ వర్మ. ‘‘అ! 2’ కోసం నన్ను అడుగుతూ, ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నవారందరికీ ధన్యవాదాలు. దాదాపు ఏడాది క్రితమే ‘అ! 2’ స్క్రిప్ట్‌ను పూర్తి చేశాను. ఇది ‘అ!’ కన్నా క్రేజీగా ఉంటుంది. కథ అంతకు మించి ఉంటుంది. కానీ సెట్స్‌పైకి తీసుకువెళ్లలేకపోతున్నాను. ఎందుకుంటే స్క్రిప్ట్‌లోని క్రేజ్నెస్కి తగ్గ క్రేజీ ప్రొడ్యూసర్ కుదరడం లేదు. నన్ను నమ్మండి. ప్రయత్నించి చాలా అలసిపోయాను. కాబట్టి జరగాల్సినప్పుడే అది (‘అ!2’ షూటింగ్‌ను ఉద్దేశించి) జరుగుతుంది’’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు ప్రశాంత్‌వర్మ. -
'ఈ అవార్డులు మా బాధ్యతను పెంచాయి'
వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా కసండ్ర, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీనివాస అవసరాల, మురళీ శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం `అ!`. హీరో నాని, ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 66 జాతీయ అవార్డుల్లో `అ!` చిత్రం మేకప్, వి.ఎఫ్.ఎక్స్ విభాగాల్లో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా..నిర్మాత నాని మాట్లాడుతూ ``కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌ను స్టార్ట్ చేశాం. తొలి ప్రయత్నంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సరికొత్త కథాంశంతో `అ!` సినిమాను రూపొందించాం. సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాదు.. ప్రశంసలను కూడా అందుకుంది. ఇప్పుడు మేకప్, వి.ఎఫ్.ఎక్స్ విభాగాల్లో జాతీయ అవార్డులు రావడం మాకెంతో ఉత్సాహానిచ్చింది. నిర్మాతగా మా బాధ్యతను మరింత పెంచింది. మా ఎంటైర్ యూనిట్ తరపున జ్యూరీకి థ్యాంక్స్`` అన్నారు. -
మరోసారి ‘అ!’ అనిపిస్తారా?
అ! సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ కల్కి సినిమాతోనూ తన ఇమేజ్ను కాపాడుకున్నాడు. ప్రస్తుతం క్వీన్ రీమేక్‌కు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న ఈ యువ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని కూడా రెడీ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. తొలి రెండు చిత్రాలను ప్రయోగాత్మక కథలతో తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ నెక్ట్స్ సినిమా కోసం లేడీ ఓరియంటెడ్ కథను సిద్ధం చేశాడు. ఈ సినిమాలోనూ తన తొలి చిత్ర కథానాయకి కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించనున్నారు. అంతేకాదు సినిమాను తమన్నాతో కలిసి కాజల్ స్వయంగా నిర్మించే ఆలోచనలో ఉన్నారట. చాలా కాలంగా నిర్మాతగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్న కాజల్ ఈ సినిమాతో తన ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. -
ఎవరు యస్ అంటారు?
ఆ!.. ఇలా కూడా సినిమా తీస్తారా? ‘అ!’ సినిమాని చూసి చాలామంది ఇలానే ఆశ్చర్యపోయారు. కొత్త రకం సినిమా చూపించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ నెక్ట్స్ ఎలాంటి సినిమా చూపించడానికి రెడీ అవుతున్నారు? అంటే.. ఈసారి కూడా న్యూ మూవీ ట్రై చేయనున్నారు. ప్రశాంత్ వర్మ ‘అ!’ కథను నమ్మి నిర్మాతగా మారిన హీరో నాని ఈసారి ఏకంగా అతని డైరెక్షన్లో సినిమా చేసే అవకాశం ఉందని టాక్.మరోవైపు రవితేజ హీరోగా ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేస్తారనే వార్త కూడా వినిపిస్తోంది. మరి.. నానీయా? రవితేజనా? దర్శకుడిగా ప్రశాంత్ వర్మ వేయబోతున్న రెండో అడుగుకి ఏ హీరో ‘యస్’ అంటాడో చూడాలి. అయితే ఈ ఇద్దరిలో ఏ హీరోతో సినిమా చేసినా, ఆ హీరో ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటూనే, కొత్తగా ఉండేలా ప్రశాంత్ వర్మ స్టోరీ లైన్ చేస్తున్నారట. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకోవాలనుకుంటున్నారట. సో.. కొత్త రకం కమర్షియల్ మూవీని చూడబోతున్నామన్న మాట. -
వర్మ వీక్ పాయింట్‌పై కొట్టేశాడు
సాక్షి, సినిమాలు : విలక్షణ సినిమాలు, వివాదాలు.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఓ ప్రత్యేకతను సంతరించి పెట్టాయి. ప్రతీ విషయాన్ని చాలా క్యాజువల్‌గా తీసుకునే వర్మ.. ఎవరైనా తన జోలికొస్తే మాత్రం ధీటుగానే స్పందిస్తుంటాడు. అలాంటి వర్మనే ఆశ్చర్యపోయేలా చేశాడు ఓ యువ దర్శకుడు. టాలీవుడ్లో అ! చిత్రంతో ప్రశాంత్ వర్మ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాడు. వైవిధ్య భరితమైన కాన్సెప్ట్, సాహసోపేతమైన స్క్రిప్ట్‌తో చిత్రం తెరకెక్కించాడంటూ విమర్శకులు అతనిపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడీ యువ దర్శకుడు ఓ పోస్టుతో వార్తల్లో నిలిచాడు.‘జనాలంతా నన్ను ఆర్జీవీతో పోలుస్తుంటారు. కానీ, నిజం చెప్పాలంటే మా ఇద్దరి మధ్యే రెండే కామన్ పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఇంటిపేరు.. రెండోది శ్రీదేవి ... అంటూ ట్వీట్ చేశాడు. అది చూసి వర్మ తన ఫేస్ బుక్ పేజీలో ‘అ!’ అంటూ రిప్లై ఇచ్చేశాడు. నటి శ్రీదేవి అంటే వర్మకు ఎంత ప్రత్యేకమైన అభిమానమో తెలిసిందే. ఈ నేపథ్యంలో కామన్ పాయింట్ పేరిట ఆమె పేరు ప్రస్తావన తెచ్చిన ప్రశాంత్.. వర్మను ఎక్కడో టచ్ చేశాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. -
ధన్యవాదాలు చెబుతున్నారు
‘‘ఇలాంటి జానర్లో సినిమా చేయాలని ముందుగానే అనుకున్నాను. కొందరికి ఒక్కసారి చూసిన వెంటనే అర్థం అవుతుంది. మరికొందరికి రెండు మూడు సార్లు చూశాక అర్థం అవుతుంది. నా నెక్ట్స్ మూవీ కూడా ఇలానే ఉంటుంది’’ అన్నారు ప్రశాంత్ వర్మ. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై కాజల్ అగర్వాల్, రెజీనా, నిత్యామీనన్, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల, మురళీ శర్మ, ప్రియదర్శి తదితరులు ముఖ్య తారలుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘అ!’. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు ప్రశాంత్ వర్మ పాత్రికేయులతో చెప్పిన విశేషాలు. ► నేను ఇంజనీరింగ్ చేశాను. డాక్యుమెంటరీలు, మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్,యాడ్ ఫిల్మ్స్ చేశాను. ‘అ!’ సినిమాకు ఇన్స్పిరేషన్ ఏమీ లేదు. ఒరిజినల్‌గా ఏమైనా రాద్దాం అనుకున్నాను. ఎక్స్ప్రెషనిజమ్ అనే జానర్లో క్యారెక్టర్స్ డిజైన్ చేసుకున్నాను. ఈ సినిమాను నేనే స్వయంగా నిర్మిద్దాం అనుకున్నాను. చేప వాయిస్ ఓవర్ కోసం వెళ్తే నానీగారు ‘నేనే నిర్మిస్తా’ అన్నారు. ► నానీగారికి కథ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ ఇచ్చాను. ఆ తర్వాత సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఈ సినిమా నేను చేసుంటే హిట్ అయినా ఫ్లాప్ అయినా పట్టించుకునేవాణ్ణి కాదు. కానీ నానీగారు నిర్మాత కాబట్టి ఆయనకున్న క్రెడిబులిటీ పాడు చేయకూడదు. ఇదే విషయాన్ని ఆయనకు ముందే చెప్పా. ఆయన కాన్ఫిడెంట్‌గా సినిమా చేద్దాం అన్నారు. ► ఈ సినిమా నా కోసం కంటే నానీ, ప్రశాంతీగారి కోసం, రాబోయే యువ దర్శకుల కోసం హిట్ కావాలని కోరుకున్నాను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్లీ చూడలేనేమో అని కొందరు, ఇంకా కొత్త కథలు రాయాలని మరికొందరు అన్నారు. ఇవే నాకు బెస్ట్ కాంప్లిమెంట్స్. సినిమా చూసి కంగ్రాట్ చెప్పకుండా థ్యాంక్స్ చెప్పడం చాలా గొప్పగా అనిపించింది. ► కమర్షియల్ సినిమాలు తీసే దర్శకులు చాలామందే ఉన్నారు. ఇలాంటి సినిమా చేయాలని ముందే అనుకున్నాను. కష్టమేమీ అనిపించలేదు. ఈ సినిమాతో అందన్నీ మెప్పించాలని ఏం అనుకోలేదు. నేను అనుకున్న జానర్ ఆడియన్స్‌ను మెప్పించాలనే ఉద్దేశంతోనే చేశాను. ► డబ్బు, అవార్డుల కోసం ఈ సినిమా చేయాలేదు. మా టీమ్‌లో ఎవరో ఒకరికి అవార్డ్ వస్తుంది అనుకుంటున్నాను. మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాము. ఈ సినిమా కంటే ముందు చాలామంది నిర్మాతలకు కథలు చెప్పాను. స్టార్ట్ అవుతాయనుకుంటుండగా ఆగిపోయాయి. నా దగ్గర సుమారు 30కి పైగా కథలు ఉన్నాయి. -
‘అ!’ ప్రీ-రిలీజ్ ఈవెంట్
-
‘అ!’ టీజర్ రిలీజ్