Awe Movie Director Prashanth Varma Next Movie With Whom...? - Sakshi
Sakshi News home page

ఎవరు  యస్‌ అంటారు?

Mar 21 2018 12:14 AM | Updated on Mar 22 2018 1:09 PM

Prashant Verma movie plan to raviteja or nani - Sakshi

నాని,రవితేజ

ఆ!.. ఇలా కూడా సినిమా తీస్తారా? ‘అ!’ సినిమాని చూసి చాలామంది ఇలానే ఆశ్చర్యపోయారు. కొత్త రకం సినిమా చూపించిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ నెక్ట్స్‌ ఎలాంటి సినిమా చూపించడానికి రెడీ అవుతున్నారు? అంటే.. ఈసారి కూడా న్యూ మూవీ ట్రై చేయనున్నారు. ప్రశాంత్‌ వర్మ ‘అ!’ కథను నమ్మి నిర్మాతగా మారిన హీరో నాని ఈసారి ఏకంగా అతని డైరెక్షన్‌లో సినిమా చేసే అవకాశం ఉందని టాక్‌.మరోవైపు రవితేజ హీరోగా ప్రశాంత్‌ వర్మ ఓ సినిమా చేస్తారనే వార్త కూడా వినిపిస్తోంది.

మరి.. నానీయా? రవితేజనా? దర్శకుడిగా ప్రశాంత్‌ వర్మ వేయబోతున్న రెండో అడుగుకి ఏ హీరో ‘యస్‌’ అంటాడో చూడాలి. అయితే ఈ ఇద్దరిలో ఏ హీరోతో సినిమా చేసినా, ఆ హీరో ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటూనే, కొత్తగా ఉండేలా ప్రశాంత్‌ వర్మ స్టోరీ లైన్‌ చేస్తున్నారట. అలాగే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండేలా చూసుకోవాలనుకుంటున్నారట. సో.. కొత్త రకం కమర్షియల్‌ మూవీని చూడబోతున్నామన్న మాట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement