Tollywood Hero's Congratulations to YS Jagan on his Majority win in AP Elections 2019 - Sakshi
Sakshi News home page

యువ సీఎంకు అభినందనలు

Published Fri, May 24 2019 10:06 AM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

Akkineni Nagarjuna Congratulate YS Jagan - Sakshi

సాక్షి హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై అన్నివర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలుపెరగని పోరాటం చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చిన జననేతపై అభినందనల వర్షం కురుస్తోంది. వైఎస్‌ జగన్‌ను అభినందిస్తూ పలువురు సినిమా ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా అభినందనలు తెలుపుతున్నారు.

‘ఘన విజయం సాధించిన కొత్త యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అభినందనలు’ అంటూ అక్కినేని నాగార్జున ట్వీట్‌ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికైన యంగెస్ట్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అభినందనలు. మంచి పాలన అందిచాలని కోరుకుంటూ శుభాకాంక్షలు’ అంటూ హీరో రవితేజ ట్వీట్‌ చేశారు. ఘన విజయాన్ని అందుకున్న వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు గొప్ప భవిష్యత్‌ ఉంటుందన్న నమ్మకాన్ని హీరో నాని వ్యక్తం చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement