
చెల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా ప్రస్తుతం హీరోగానూ రాణిస్తున్నాడు. ఓ బేబి సినిమాతో చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తేజ జాంబిరెడ్డి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఢిపరెంట్ జానర్‌తో తొలిసారే ప్రయోగం చేసిన తేజ ఇప్పుడు జోరు మీదున్నాడు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం హను-మాన్ అనే చిత్రంలో తేజ నటిస్తున్నాడు. జాంబిరెడ్డితో హిట్ ఇచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనే మరోసారి సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. తెలుగులో తొలి సూపర్ హీరో సిరీస్‌గా ఫిక్షనల్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం.
అయితే ఈ సినిమా కోసం తేజ సజ్జ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ టాలెంటెడ్ హీరో ఇప్పుడు కోటి రూపాయల పారితోషికం తీసుకుంటున్న హీరోల జాబితాలో చేరిపోయాడు. హను-మాన్ చిత్రం కోసం ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేశాడట. ఇటీవలె జాంబిరెడ్డి సినిమాతో ఆకట్టుకున్న తేజ ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని కోటి రూపాయల రెమ్యునరేషన్‌ను తీసుకుంటున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment