తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘హను–మాన్’. అమృతా అయ్యర్ కథానాయిక. శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సోమవారంతో పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘హనుమంతుని శక్తులను పొందిన హీరో అంజనాద్రి కోసం ఎలా పోరాటం చేశాడు? అనేది చిత్ర కథాంశం.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment