
యంగ్ హీరో తేజ సజ్జా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘హను-మాన్’. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది. ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హను-మాన్ గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం...
♦ ‘జాంబి రెడ్డి’ తర్వాత ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమా కోసం అంజనాద్రి అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఆ ఊరి చుట్టే కథ తిరుగుతంది.
♦ హను-మాన్ షూటింగ్ 2021 జూన్ 5న ప్రారంభమైంది. వట్టినాగుపల్లిలో ఓ స్థలాన్ని లీజుకు తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. తొలుత ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్థాయిలోనే తెరకెక్కించాలనుకున్నారు. కానీ నిర్మాత ప్రొత్సాహంతోనే పాన్ ఇండియా స్థాయిలో తీర్చిదిద్దారు. మొత్తం 11 భాషల్లో విడుదల కాబోతుంది.
♦ ఈ సినిమా కోసం ముగ్గురు సంగీత దర్శకులు పని చేశారు. సంగీత దర్శకులు అనుధీప్ దేవ్, కృష్ణ సౌరభ్ చెరో పాటను కంపోజ్ చేశారు. ఇక మిగిలిన పాటలను, నేపథ్య సంగీతాన్ని గౌర హరి అందించాడు
♦ ఈ చిత్రం మొత్తం ఫుటేజీ నిడివి 2.45 గంటలు. సెన్సార్ తర్వాత ఇది 2.38 గంటలు అయింది. సినిమాకు ఏది అవసరమో దాన్నే షూట్ చేశామని, కేవలం ఐదారు నిమిషాలు ఫుటేజ్ మాత్రమే వృధా అయిందని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు.
♦ ఈ సినిమాను గతేడాది మే 12న విడుదల చేయాల్సింది. కానీ వీఎఫెక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో పలుమార్లు వాయిదా వేస్తూ.. చివరకు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నారు.
♦ ఈ చిత్రంలో మొత్తం 1600 వీఎఫెక్స్ ఫాట్స్ ఉన్నాయట. వానరం, ఎలుకలు, చిరుత, పులి ఇవన్నీ వీఎఫెక్స్ సాధ్యమైయ్యాయని దర్శకుడు చెప్పాడు. బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొని కొత్తతరం వీఎఫెక్స్ టీమ్‌తో పని చేశారట. ఔట్‌ఫుట్ మాత్రం అద్భుతంగా ఉంది.
♦ ఓ సారి అడవిలో షూటింగ్ చేస్తున్న సమయంలో తేజ సజ్జకు తృటిలో ప్రమాదం తప్పిందట. చెట్టుకింద ఓ సన్నివేశాన్ని షూట్ చేస్తుంటే.. ఓ పాము తేజ సజ్జదగ్గరకు వచ్చిందంట. డైరెక్టర్ మానిటర్‌లో చూస్తే అది పాములా కనిపించలేదట. పక్కనే ఉన్న వ్యక్తి చెప్పబోతుంటే డైరెక్టర్ పట్టించుకోలేదట. షాట్ పూర్తయిన తర్వాత అక్కడ పాము ఉందని చెప్పడంతో అంతా భయంతో పరుగులు తీశారట.
♦ ఈ చిత్రంలో 'వాన' హీరో వినయ్ రాయ్ విలన్ రోల్లో కనిపించనుండగా, అషికా రంగనాథ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇక హనుమంతుడిగా చిరంజీవి కనిపించబోతున్నట్లు టాక్. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయాన్ని ఎక్కడ అధికారికంగా చెప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment