
టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం హను-మాన్. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ట్రైలర్ విడుదలయ్యాక ప్రతి ఒక్కరు బీజీఎం బాగుందని కామెంట్ చేశారు. వాస్తవానికి ఈ చిత్రానికి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు.సంగీత దర్శకులు అనుధీప్ దేవ్, కృష్ణ సౌరభ్ చెరో పాటను కంపోజ్ చేశారు. ఇక మిగిలిన పాటలను, నేపథ్య సంగీతాన్ని గౌర హరి అందించాడు.
ఆయన అందించిన నేపథ్య సంగీతంపై చిత్ర యూనిట్‌తో పాటు సీనీ ప్రియులు కూడా ప్రశంసలు కురిపించారు. అయితే ఈ చిత్రానికి ప్రాణం పెట్టి సంగీతం అందించానని చెబుతున్నాడు గౌరహరి. దాదాపు రెండేళ్ల పాటు కష్టపడి సంగీతాన్ని సమకూర్చారట. ఇప్పటి వరకు విడుదల అయిన బీజీఎమ్, హనుమాన్ చాలీసా ,శ్రీరామ దూత స్తోత్రం ,ఎంత ప్రభంజనం సృష్టించాయో మనకు తెలుసు. ఆ పాటలు వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అంటే దానికోసం గౌర హరి ఎంత ఎఫర్ట్ పెట్టాడో అర్థం చేసుకోవచ్చు.
డైరెక్టర్ విజన్ కు తగ్గట్టుగా, తీసిన విజువల్స్ ను మరోక మెట్టు ఎక్కించడంలో సంగీత దర్శకుడిగా గౌర హరి వంద శాతం విజయం సాధించాడని చిత్ర బృందమే పేర్కొంది అంటే గౌరహరి పనితనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. యాడ్స్, టీవీ సీరియల్స్‌తో ఆయన సంగీత ప్రస్థావన మొదలు పెట్టి నేడు పాన్ ఇండియా సినిమా హనుమాన్‌కు పనిచేసే స్థాయికి ఎదిగారు గౌరహరి. మరి ఈ చిత్రంతో గౌరహరి పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అవుతారో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment