
చెల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా ప్రస్తుతం హీరోగానూ రాణిస్తున్నాడు. ఇటీవలె క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ జాంబిరెడ్డి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. జాంబీస్ లాంటి కొత్త జోనర్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో మరోసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి ‘హనుమాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పురాణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా తేజ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఈ మూవీకి సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఇక మరో ఇంటట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే..ఈ మూవీలో ఓ కీలకపాత్ర కోసం వరలక్ష్మి శరత్‌కుమార్‌ను సంప్రదించారట. ఇటీవలె తెలుగులో ఆమె నటించిన క్రాక్, నాంది సినిమాలకు మంచి ఆధరణ లభించింది. ముఖ్యంగా వరలక్ష్మి పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ‘హనుమాన్’ చిత్రంతో మరోసారి అలరించేందుకు సిద్ధం అవుతుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
చదవండి : వైరల్ : షూటింగులో హీరో విశాల్‌కు తప్పిన పెద్ద ప్రమాదం
సమంత నుంచి చాలా విషయాలను నేర్చుకున్నా: నటుడు
Comments
Please login to add a commentAdd a comment