హనుమాన్‌ పార్ట్‌-2 కాదు.. ఏకంగా సినిమానే: ప్రశాంత్ వర్మ తండ్రి | Prashanth Varma Express Happy Moments With Hanuman Success | Sakshi
Sakshi News home page

Hanu-Man Movie: నా లైఫ్‌లో ఫస్ట్ ‍టైమ్‌ ఇలా: ప్రశాంత్ వర్మ తండ్రి ఎమోషనల్

Published Sun, Jan 14 2024 1:30 PM | Last Updated on Sun, Jan 14 2024 2:42 PM

Prashanth Varma Express Happy Moments With Hanuman Success - Sakshi

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే పాజిటివ్‌ వచ్చింది. మహేశ్‌ బాబు నటించిన గుంటూరు కారం సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద పోటీపడిన ఈ సినిమాకు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన సినిమా తీశారంటూ నెటిజన్స్, సినీ ప్రముఖులు సైతం హనుమాన్ మేకర్స్‌ను అభినందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన ప్రశాంత వర్మ తండ్రి తన కుమారుడిపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ మారింది. 

(ఇది చదవండి: మెగా హీరో బర్త్‌డే.. సందడి చేసిన రామ్ చరణ్ దంపతులు!)

ఆయన మాట్లాడుతూ..  'హనుమాన్‌ తీసినోడు మా అబ్బాయే. నా లైఫ్‌లో ఫస్ట్‌ టైమ్‌ ఇలాంటి అనుభవం. సినిమా చాలా అద్భుతంగా ఉంది. హనుమాన్ పార్ట్-2 కాదు. హనుమాన్‌పై ఏకంగా సినిమానే వస్తది.' అంటూ దర్శకుడి తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. ఈ సినిమా సక్సెస్‌ సాధించడంతో అభినందించేందుకు చాలా మంది ఫోన్‌ చేస్తున్నట్లు ప్రశాంత్ వర్మ చెప్పారు. అయితే తాను జ్వరంతో బాధపడుతున్నాననీ.. ఆరోగ్యం కుదుటపడగానే అందరినీ కలుస్తానంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రంలో అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌ కీలక పాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement