హను-మాన్‌ ఎఫెక్ట్‌.. ప్రశాంత్‌ వర్మకు రూ.1000 కోట్ల ఆఫర్‌? | Hanuman Movie Director Prashanth Varma Got RS 1000 Crore Budget Movie Offer | Sakshi
Sakshi News home page

హను-మాన్‌ ఎఫెక్ట్‌.. ప్రశాంత్‌ వర్మకు రూ.1000 కోట్ల ఆఫర్‌?

Published Wed, Jan 31 2024 6:21 PM | Last Updated on Wed, Jan 31 2024 6:26 PM

Hanuman Movie Director Prashanth Varma Got RS 1000 Crore Budget Movie Offer - Sakshi

సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని సినిమాలు ఊహించని రీతిలో విజయాలు సాధిస్తాయి. చిన్న సినిమాలే అయినా వందల కోట్ల వసూళ్లను సాధించి, మేకర్స్‌ తలరాతనే మార్చేస్తాయి. తాజాగా ‘హను-మాన్‌’ టీమ్‌ ఆ అద్భుతాన్ని  సృష్టించింది. సంక్రాంతి బరిలో అతి చిన్న చిత్రంగా వచ్చిన ‘హను-మాన్‌’.. బాక్సాఫీస్‌ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. ఊహించని కలెక్షన్స్‌తో చరిత్ర సృష్టించింది.

ఇప్పటికే రూ. 275 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం.. త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్‌లో చేరబోతుంది. ఈ ఒక్క చిత్రం దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తలరాతనే మార్చేసింది. ఇప్పటివరకు టాలీవుడ్‌లో చిన్న దర్శకుల లిస్ట్‌లో ఉన్న ప్రశాంత్‌..ఈ ఒక్క సినిమాతో పాన్‌ ఇండియా డైరెక్టర్‌ అయ్యాడు. అంతేకాదు పలు ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ ప్రశాంత్‌కు అడ్వాన్స్‌ ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. తన సినిమాకు వందల కోట్ల బడ్జెట్‌ మాత్రమే కాదు..ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారట.  ఈ విషయాన్ని స్వయంగా ప్రశాంత్‌ వర్మనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

‘హను-మాన్‌’ తర్వాత నాకు రూ.100, 200 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేసే ఆఫర్లు కూడా వచ్చాయి. అంతేకాదు రూ. 1000 కోట్ల ఆఫర్‌ కూడా వచ్చింది. హను-మాన్‌ మూవీ చూసిన ఓ ఎన్నారై నాకు ఈ ఆఫర్‌ ఇచ్చాడు. మన ఇతిహాసాలతో ఇలాంటి సినిమా చేస్తానంటే రూ.1000 కోట్లు పెట్టడానికి కూడా నేను రెడీ అన్నారు. అయితే ఇక్కడ బడ్జెట్‌ ముఖ్యం కాదు. పెట్టిన డబ్బుకు మించిన క్వాలిటీ చూపించామా లేదా అనేది ముఖ్యం. చెప్పిన బడ్జెట్‌లో సినిమా తీసే డైరెక్టర్‌ని కాదు నేను. ఈ విషయం మొదట్లోనే నిర్మాతలకు చెప్తాను.

నేను ఒక 10 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే..దాన్ని 50 కోట్ల సినిమాలా చూపిస్తాను. 40 కోట్లతో తీస్తే..దాన్ని రూ.150 కోట్ల సినిమాలా తీస్తాను. మార్కెట్‌ను అంచనా వేసుకొని సినిమాను తెరకెక్కిస్తాను’అని ప్రశాంత్‌ వర్మ అన్నారు. రూ.1000 కోట్ల ఆఫర్‌ ఇప్పటి వరకు రాజమౌళికి కూడా రాలేదు. కానీ ఒక్క సినిమాతో ప్రశాంత్‌ వర్మకు అంత పెద్ద ఆఫర్‌ రావడం గొప్ప విషయమే.  ఒకవేళ ప్రశాంత్‌ వర్మ అంత పెద్ద బడ్జెట్‌తో సినిమా తీస్తే..అది కచ్చితంగా  రూ.2000 కోట్లను వసూలు చేస్తుందని నెటిజన్స్‌ అభిప్రాయ పడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement