
‘గరుడవేగ’ విజయవంతం అయ్యే సరికి యాంగ్రీస్టార్ రాజశేఖర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. చాలా ఏళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూసిన రాజశేఖర్‌కు ఈ చిత్రం ఘన విజయాన్ని ఇచ్చింది. ఈ మూవీ ఇచ్చిన బూస్ట్‌తో మళ్లీ అదే ఎనర్జితో సినిమాలను చేస్తున్నారు. యంగ్ టాలెంటెండ్ ప్రశాంత్ వర్మతో తీస్తున్న ‘కల్కి’ చిత్రం ఇప్పటికే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ట్రైలర్ విడుదల చేయడంలో సమస్యలు తలెత్తిన నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేయాల్సిన ట్రైలర్‌ను సాయంత్రం ఐదు గంటలకు వాయిదా వేశారు. మళ్లీ సాంకేతికలోపం తలెత్తడంతో ఇప్పటికీ విడుదల చేయలేకపోయింది చిత్రబృందం. దీంతో ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రైలర్ కోసం ఇంకెంతసేపు ఎదురుచూడాల్సి వస్తుందో మరి. శివానీ–శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో నందితా శ్వేత, పూజిత పొన్నాడ, ఆదాశర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 28న విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment