
ఆ....ఒక్కటి అడక్కండి!
గ్లామర్ పాయింట్
కేవలం నటించడం కోసం నటించడం అని కాకుండా ఎప్పటికప్పుడు నటనలో కొత్తదనం చూపుతుంది కల్కి. తాజాగా ఆమె నటించిన ‘మార్గరీటా విత్ ఏ స్ట్రా’ సినిమాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సెరెబ్రల్ పాల్సికి గురై వీల్‌చైర్‌కు పరిమితమైన అమ్మాయిగా కల్కి నటనకు ప్రత్యేక ప్రశంసలు లభిస్తున్నాయి.
ప్రేక్షకులు, సినీవిమర్శకులే కాకుండా సాటి నటులు కూడా కల్కిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇదిసరేగానీ, తన టీనేజి లవ్ స్టోరీ గురించి చెప్పి ఒక సమావేశంలో అందరినీ నవ్వించింది కల్కి. తాను టీనేజ్‌లో ఉన్నప్పుడు ఏ అబ్బాయి తన వైపు చూసినా, టక్కుమని ప్రేమలో పడేదట. పెళ్లి కూడా చేసుకోవాలనుకునేదట. అంతేనా... పొయెట్రీ కూడా రాసేదట. ఆనాటి విషయాలను గుర్తు తెచ్చుకుంటూ నవ్వుతున్న కల్కిని ఒక విలేఖరి- ‘‘అనురాగ్ కాశ్యప్‌తో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి?’’ అని అడిగితే ఆమె ముఖంలో నవ్వు మాయమై కోపం ప్రత్యక్షమైంది. ఆ ఒక్కటి అడక్కండి అని ఆమె ఎన్నిసార్లు చెప్పిందో కదా!