అనుకున్నవన్నీ జరగవు. జరిగేవన్నీ ఊహించలేం. అయితే ఏది జరిగినా మన మంచికే అని పాజిటివ్‌గా తీసుకోవడంలోనే మానసిక ప్రశాంతత ఉంటుంది. సినిమా రంగం విషయానికి వస్తే చాలా మంది డాక్టర్ అవ్వాలని యాక్టర్ అయినవారూ, ఇంజినీర్ కావాలనుకున్న వారు నటులు, దర్శకులు, దర్శకులవ్వాలని ఆశించిన వారు నటులు అవుతుంటారు.
నటి దిశాపటానీ ఈ కోవకు చెందిన∙ నటేనట. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ ఉత్తరాది బ్యూటీ తెలుగు తదితర దక్షిణాది భాషల్లోనూ నటించి ఇండియన్ నటిగా రాణిస్తున్నారు. తాజాగా కంగువ చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యారు. గ్లామర్ క్వీన్‌గా ముద్రవేసుకున్న దిశా పటానీ.. కల్కి చిత్రంలో హీరోయిన్‌గా మెరిశారు. అలాగే వెల్ కమ్ టు ది జంగిల్ అనే హిందీ చిత్రంలో నాయకిగా నటిస్తున్నారు. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తనకు ఉత్తరాది, దక్షణాది చిత్రాలన్న తారతమ్యాలు లేవని, అన్ని భాషా చిత్రాల్లోనూ నటించాలని కోరుకుంటున్నానని చెప్పారు.
కల్కి చిత్రంలో నటిస్తున్నప్పుడు నటుడు ప్రభాస్ ఇంటి నుంచి భోజనం తెప్పించి, ఆయనే స్వయంగా వడ్డించేవారని చెప్పారు. కోలీవుడ్‌లో నటుడు సూర్య సరసన కంగువ చిత్రంలో నటించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తున్నట్లు చెప్పారు. తన తండ్రి పోలీస్ అధికారి అని, తల్లి ఆరోగ్యశాఖలో ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలను నిర్వహించారని తెలిపారు. ఇక తన సహోదరి ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్ట్‌నెంట్ కల్నల్ అని, తనకు యుద్ధ విమాన పైలట్ కావాలని కోరుకున్నానని, అయితే ఆ కలను ఫలింపజేసుకోకుండా నటిగా మారానని చెప్పారు. ఇందుకోసం తాను డాన్స్, ఫైట్స్, జిమ్నాస్టిక్ కళలో శిక్షణ పొందినట్లు నటి దిశాపటానీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment