35ఏళ్లు  వెనక్కి! | Kalki will be a franchise: Director Prasanth Varma | Sakshi
Sakshi News home page

35ఏళ్లు  వెనక్కి!

Jan 2 2019 12:55 AM | Updated on Jan 2 2019 12:55 AM

 Kalki will be a franchise: Director Prasanth Varma - Sakshi

‘పి.ఎస్‌.వి. గరుడవేగ’ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషనల్‌ హిట్‌ అందుకున్నారు రాజశేఖర్‌. ఆ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘కల్కి’. ‘అ!’ వంటి విలక్షణమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్‌ వర్మ ‘కల్కి’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శివానీ శివాత్మిక మూవీస్‌ బ్యానర్‌ సమర్పణలో హ్యాపీ మూవీస్‌ పతాకంపై సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్‌ నిర్మిస్తున్నారు. అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్‌ విల్సన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. నూతన సంవత్సరం సందర్భంగా ‘కల్కి’ చిత్రం ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఓపెన్‌ టాప్‌ జీప్‌లో స్టైల్‌గా కూర్చుని ఉన్న రాజశేఖర్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. 1983 నేపథ్యంలో ఈ సినిమా కథాంశం సాగుతుందట. మరి.. 35 ఏళ్ల క్రితం ఏం జరిగింది? అన్నది తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. అశుతోష్‌ రానా, నాజర్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement