కల్కి సినిమాలో హీరో ప్రభాస్ ఉపయోగించిన ‘బుజ్జి’ కారు వరంగల్ నగరంలో సందడి చేసింది. ఇటీవల విడుదలైన కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ నిమిత్తం హనుమకొండలోని ఏషియన్ మాల్‌లో ‘బుజ్జి’కారును బుధవారం ప్రదర్శనకు ఉంచారు.
దీనిని చూసేందుకు యువత పెద్ద ఎత్తున తరలివచ్చింది. బుజ్జితో సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసుకుని సంబురపడ్డారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ
Kalki Bujji: 'బుజ్జి' సందడితో.. యువత సెల్ఫీలు!
Published Thu, Jul 25 2024 1:22 PM | Last Updated on Thu, Jul 25 2024 5:15 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment