కల్కిలో శ్రీకృష్ణుడిగా మహేశ్‌ బాబు.. నాగ్‌ అశ్విన్‌ అలా అనేశాడేంటి? | Director Nag Ashwin Talked About The Krishna Character In Kalki 2898 AD | Sakshi
Sakshi News home page

Nag Ashwin: పార్ట్‌-2లో శ్రీకృష్ణుడిగా మహేశ్‌ బాబు.. నాగ్‌ అశ్విన్‌ రియాక్షన్‌ ఇదే!

Published Fri, Jul 5 2024 5:36 PM | Last Updated on Fri, Jul 5 2024 6:15 PM

Kalki Director Nag Ashwin Comments On Mahesh Babu Role In part 2

ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ 'కల్కి 2898 ఏడీ'. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఆరు రోజుల్లో దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. అయితే తాజాగా డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.

కల్కి చిత్రం పార్ట్-2లో మహేశ్ బాబు ఉంటే బాగుంటుందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు? దీనిపై మీరేమంటారు? అని నాగ్‌ అశ్విన్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. 'ఇప్పుడైతే మేం మహేశ్ బాబును తీసుకోవాలని అనుకోలేదు.. ఈ సినిమాలో కాకుండా.. వేరే ఏదైనా చిత్రంలో ఆయన చేస్తే బాగుంటుంది' అని అన్నారు. అయితే కల్కి పార్ట్‌-2లో ప్రభాస్‌ కర్ణుడి పాత్రలో కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. 

అంతే కాకుండా హీరో నాని, నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో ఎందుకు తీసుకోలేదని కొందరు ప్రశ్నించారు. అయితే దీనిపై బదులిస్తూ.. వాళ్లద్దరిని తీసుకోవడం ఈ చిత్రంలో కుదరలేదు.. ఎక్కడ ఛాన్స్ వస్తే వాళ్లను అక్కడ పెట్టేస్తాను' అని అన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement