యాంగ్రీ హీరోతో సన్నీ | sunny leone special song in rajasekhar film | Sakshi
Sakshi News home page

యాంగ్రీ హీరోతో సన్నీ

Published Tue, Mar 7 2017 10:37 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

యాంగ్రీ హీరోతో సన్నీ

యాంగ్రీ హీరోతో సన్నీ

చాలా కాలంగా వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న యాంగ్రీ హీరో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గరుడ వేగ. గుంటూరు టాకీస్తో మంచి విజయం సాధించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. రాజశేఖర్ మరోసారి యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పూజా కుమార్ హీరోయిన్గా నటిస్తోంది.

ఎక్కువగా భాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేస్తున్నారు చిత్రయూనిట్. సినిమాలో కీలక సమయంలో వచ్చే ఓ స్పెషల్ సాంగ్ను బాలీవుడ్ హాట్ బ్యూటి సన్నీలియోన్తో చేయిస్తున్నారు. భారీ మొత్తం ఆఫర్ చేయటంతో సన్నీ కూడా వెంటనే ఒప్పేసుకుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ చేసిన సన్నీ మరోసారి తెలుగు ప్రేక్షకులను ఊర్రూతలూగించేందుకు రెడీ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement