
సీనియర్ హీరో రాజశేఖర్ ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సక్సెస్‌ను గరుడ వేగ సినిమాతో అందుకున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన గరుడ వేగ ఈ శుక్రవారం విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయం దక్కటంతో యాంగ్రీ హీరో సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు చిత్రయూనిట్ తో కలిసి పార్టీ చేసుకున్నారు.
ఈ పార్టీలో రాజశేఖర్‌తో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లు సరదాగా డ్యాన్స్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. రాజశేఖర్ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటించిన ఈ సినిమాలో పూజా కుమార్, అదిత్ అరుణ్, శ్రద్ధాదాస్, కిశోర్ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే పాజిటివ్ టాక్ రావటంతో ఈ వీకెండ్ వరకు కలెక్షన్లకు ఎలాంటి డోకా లేదు. అయితే గరుడ వేగ టాక్‌పై స్పందించిన రాజమౌళి ఆదివారం సినిమా చూసేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నట్టుగా తెలిపారు. అంటే ఆదివారం రాజమౌళి గరుడ వేగ సినిమాపై తన మార్క్ రివ్యూ ఇస్తే సోమవారం కలక్షన్లు ఊపందుకునే అవకాశం ఉంది.
Congratulations team PSV Garuda Vega.. Film carrying quite a positive buzz.. Booked our tickets for Sunday..
— rajamouli ss (@ssrajamouli) 3 November 2017