ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్ | tollywood Stars to release Garuda Vega teaser | Sakshi
Sakshi News home page

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

Sep 22 2017 9:56 AM | Updated on Aug 13 2018 3:04 PM

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్ - Sakshi

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

చాలా రోజులుగా సరైన హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో 'పియస్ వి గరుడ వేగ 126.18 ఎమ్'

చాలా రోజులుగా సరైన హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో 'పియస్ వి గరుడ వేగ 126.18 ఎమ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజశేఖర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియా పేజ్ ల ద్వారా ఒకేసారి ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

గరుడవేగ టీజర్ ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నారు. టాలీవుడ్ స్టార్స్ రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, మంచు లక్ష్మీ, తాప్సీ పన్నులు ఒకేసారి తమ సోషల్ మీడియా పేజ్ లలో ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ లతో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై టీజర్ రిలీజ్ తరువాత మరింతగా అంచనాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement