నన్ను పిచ్చోడిలా చూసేవారు: రానా | Rana Daggubati and Taapsee Pannu are all smiles at The Ghazi Attack press meet! | Sakshi
Sakshi News home page

నన్ను పిచ్చోడిలా చూసేవారు: రానా

Published Thu, Jan 26 2017 12:20 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

నన్ను పిచ్చోడిలా చూసేవారు: రానా - Sakshi

నన్ను పిచ్చోడిలా చూసేవారు: రానా

‘‘32 ఏళ్ల నాకు 20 ఏళ్లుగా విశాఖ ఆర్కే బీచ్‌తో పరిచయం ఉంది. అక్కడ ఘాజీ సబ్‌మెరైన్‌ను చూస్తుంటాను కానీ ఘాజీ కథ తెలియదు. విశాఖలో ఇంత గొప్ప కథ జరిగిందని చాలా మందికి తెలియదు. ఇలాంటి సినిమాలో నటించే ఛాన్స్‌ అరుదుగా వస్తుంది’’ అని హీరో రానా అన్నారు. రానా, తాప్సీ, కేకే మీనన్, అతుల్‌ కులకర్ణి, నాజర్‌ ముఖ్య తారలుగా సంకల్ప్‌ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్, పీవీపీ సినిమాస్‌ నిర్మించిన ‘ఘాజీ’  ఫిబ్రవరి 17న విడుదల కానుంది.

ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ– ‘‘ఏ సినిమా చేస్తున్నావని కొంతమంది స్నేహితులు, నిర్మాతలు నన్నడిగారు. సబ్‌మెరైన్‌ కథతో చిత్రం చేస్తున్నానని చెబితే నన్ను పిచ్చోడిలా చూసేవారు. కరణ్‌ జోహార్, టాన్‌డన్‌ మా సినిమాను హిందీలో రిలీజ్‌ చేయడానికి ముందుకొచ్చారు.

టీజర్‌ చూసిన తర్వాత అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడానికి ఒప్పుకున్నారు’’ అని చెప్పారు.  ‘‘నా ఐడియాను నమ్మి ఈ సినిమా చేసిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ‘ఘాజీ’ నా మొదటి సినిమా అని గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు సంకల్ప్‌. ‘‘ఈ  సినిమా నిర్మించడం గర్వంగా భావిస్తున్నా. ఇండియన్‌ సినిమాలో ఇప్పటి వరకూ ఎవరు టచ్‌ చేయని కథ ఇది’’ అని ప్రసాద్‌.వి.పొట్లూరి తెలిపారు. నిర్మాత జగన్‌మోహన్‌ వంచ, తాప్సీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement