KK Menon
-
ఘాజీ వంటి సినిమాలు రావాలి
‘‘యువతలో స్ఫూర్తి నింపే చిత్రం ఇది. దేశంలో ఐకమత్యాన్ని పెంచి, శాంతిపథంలో పయనించేలా చేయ డంలో ‘ఘాజీ’ వంటి చిత్రాలు దోహదపడతాయి. ఇలాంటి చిత్రాలు రావాలి’’ అన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. రానా, తాప్సీ, అతుల్ కులకర్ణి, కేకే మీనన్ ముఖ్య తారలుగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో పీవీపీ సినిమాస్, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు నిర్మించిన ‘ఘాజీ’ని ఆదివారం వెంకయ్య నాయుడు చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘హింస, చౌకబారు విషయాలు లేకుండా సంకల్ప్ రెడ్డి చిత్రాన్ని బాగా తీశారు. కమర్షియల్ హంగులు, రంగులు లేక పోయినా.. మెండుగా దేశభక్తిని కలిగించే చిత్రమిది. రానా చక్కటి నటన ప్రదర్శించారు. ఈ సాహసో పేతమైన చిత్రాన్ని రూపొందించిన దర్శక–నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు. ఇలాంటి దేశభక్తి చిత్రాలకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడం సముచితమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న విషయాన్ని ఆయన ముందుంచితే.. ‘‘వినోదపు పన్ను అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధి లోకి వస్తుంది. పీవీపీ ఓ భారతీయ పౌరుడిగా బాధ్యతతో సినిమా తీశా రు. ఢిల్లీలో కేంద్ర మంత్రులకు ‘ఘాజీ’ హిందీ వెర్షన్ చూపించడానికి ప్రయత్నిస్తా’’ అన్నారు. చిత్రనిర్మాత పీవీపీ పాల్గొన్నారు. -
నన్ను పిచ్చోడిలా చూసేవారు: రానా
‘‘32 ఏళ్ల నాకు 20 ఏళ్లుగా విశాఖ ఆర్కే బీచ్‌తో పరిచయం ఉంది. అక్కడ ఘాజీ సబ్‌మెరైన్‌ను చూస్తుంటాను కానీ ఘాజీ కథ తెలియదు. విశాఖలో ఇంత గొప్ప కథ జరిగిందని చాలా మందికి తెలియదు. ఇలాంటి సినిమాలో నటించే ఛాన్స్ అరుదుగా వస్తుంది’’ అని హీరో రానా అన్నారు. రానా, తాప్సీ, కేకే మీనన్, అతుల్ కులకర్ణి, నాజర్ ముఖ్య తారలుగా సంకల్ప్ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, పీవీపీ సినిమాస్ నిర్మించిన ‘ఘాజీ’ ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ– ‘‘ఏ సినిమా చేస్తున్నావని కొంతమంది స్నేహితులు, నిర్మాతలు నన్నడిగారు. సబ్‌మెరైన్ కథతో చిత్రం చేస్తున్నానని చెబితే నన్ను పిచ్చోడిలా చూసేవారు. కరణ్ జోహార్, టాన్‌డన్ మా సినిమాను హిందీలో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. టీజర్ చూసిన తర్వాత అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు’’ అని చెప్పారు. ‘‘నా ఐడియాను నమ్మి ఈ సినిమా చేసిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ‘ఘాజీ’ నా మొదటి సినిమా అని గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు సంకల్ప్. ‘‘ఈ సినిమా నిర్మించడం గర్వంగా భావిస్తున్నా. ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకూ ఎవరు టచ్ చేయని కథ ఇది’’ అని ప్రసాద్.వి.పొట్లూరి తెలిపారు. నిర్మాత జగన్మోహన్ వంచ, తాప్సీ తదితరులు పాల్గొన్నారు. -
అక్టోబర్ 2న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: రచన (నటి), కె.కె. మీనన్ (నటుడు) ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 11. ఇది చాలా ప్రత్యేకతను సంతరించుకున్న సంఖ్య. దీనిలో రెండు ఒకట్లు (సూర్యుని సంఖ్య) కలిసి చంద్రుని సంఖ్య 2 ఏర్పడింది కాబట్టి ఇది మాస్టర్ నంబర్ అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం మీరు సామాజిక సేవా దృక్పథం కలిగి ఉండి, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. పోయిన సంవత్సరం ప్రారంభించిన ప్రాజెక్టుల నుంచి మంచి లాభాలు గడిస్తారు. వృత్తి, వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలు అద్భుతంగా ఉంటాయి. ఇంటర్వ్యూలు, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగోన్నతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అధికంగా చేస్తారు. దానివల్ల ఖర్చులు ఎక్కువ అయినప్పటికీ, మంచి ఫలితం కూడా ఉంటుంది. వీరు బిల్డర్లు గనుక అయితే వీరికిది ల్యాండ్‌మార్క్ ఇయర్‌గా మిగిలిపోతుంది. అయితే చంద్రుని దుష్ర్పభావం వల్ల వీరికి ఈ సంవత్సరం మానసికాందోళన, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, మూడీగా అయిపోతుండటం వంటి ప్రమాదాలున్నాయి కాబట్టి ముందే తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండటం మంచిది. లక్కీ నంబర్స్: 1, 2, 3, 6, 7; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్; లక్కీ డేస్: శుక్ర, శని, ఆది, సోమవారాలు. సూచనలు: అమ్మవారిని ఆరాధించడం, తల్లిని కానీ, తల్లితో సమానురాలైన వారిని కానీ ఆదరించి, గౌరవించి సేవ చేయడం, ఆలయాలలో, మదరసాలలో, చర్చిలలో అన్నదానం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్