త్వరలో ఘాజీ.. | Rana Daggubati's Ghazi clears censors, to release on February 17 | Sakshi
Sakshi News home page

త్వరలో ఘాజీ..

Published Mon, Feb 6 2017 1:23 AM | Last Updated on Mon, Aug 13 2018 3:04 PM

త్వరలో ఘాజీ.. - Sakshi

త్వరలో ఘాజీ..

ఉత్కంఠభరితమైన యుద్ధ సన్నివేశాలతో త్వరలో వెండితెరపైకి రానుంది ఘాజీ చిత్రం. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టెయిన్ మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, నటి తాప్సీ, కేకే, మీనన్, నాజర్, అతుల్‌ కులకర్ణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సీనియర్‌ నటుడు ఓంపురి నటించిన చివరి చిత్రం ఇదేనన్నది గమనార్హం. మది ఛాయాగ్రహణ, కే సంగీతాన్ని, జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్‌ప్రసాద్‌ కళా దర్శకత్వాన్ని అందించిన ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు సంకల్ప్‌ పరిచయం అవుతున్నారు.

ఇది ఘాజీ అనే సబ్‌మెరైన్  నేపథ్యంలో సాగే కథా చిత్రం అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఇతివృత్తంతో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులు ఇంతకు ముందెప్పుడు చూసి ఉండరని అన్నారు. జనవరి 11వ తేదీన విడుదలైన చిత్ర ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ఈ నెలలోనే ఘాజీ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement