manchi laxmi
-
రిచ్.. స్టైలిష్.. గరుడవేగ
సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో గరుడ వేగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాజశేఖర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు. శ్రద్దా దాస్, పూజ కుమార్, కిశోర్, ఆదిత్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా గరుడవేగ టీజర్ పలువురు సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియా పేజ్ ల ద్వారా ఒకేసారి విడుల చేశారు. రాజశేఖర్ కౌంటర్ టెర్రరిజం ఫైటర్ గా నటిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో స్టైలిష్ గా తెరకెక్కించారు. ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న గరుడవేగ, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్
చాలా రోజులుగా సరైన హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో 'పియస్ వి గరుడ వేగ 126.18 ఎమ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజశేఖర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియా పేజ్ ల ద్వారా ఒకేసారి ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. గరుడవేగ టీజర్ ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నారు. టాలీవుడ్ స్టార్స్ రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, మంచు లక్ష్మీ, తాప్సీ పన్నులు ఒకేసారి తమ సోషల్ మీడియా పేజ్ లలో ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ లతో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై టీజర్ రిలీజ్ తరువాత మరింతగా అంచనాలు పెరుగుతాయని భావిస్తున్నారు. -
కేటీఆర్‌ను అభినందించిన మంచు లక్ష్మి
హైదరాబాద్ : రాష్ట్ర పరిశ్రమలు, చేనేత మంత్రి కె.తారకరామారావు చేనేత ప్రచారకర్తగా దూసుకుపోతున్నారు. చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఒక్కరూ వారంలో ఓ రోజు చేనేత వస్త్రాలు ధరించాలని ఇచ్చిన పిలుపు మేరకు భారీ స్పందన కనిపిస్తోంది. మంత్రి కార్యాలయ అధికారులు, సిబ్బందితో పాటూ టాలీవుడ్ ప్రముఖులు చేనేత వస్త్రాల ప్రాముఖ్యత, ప్రాశస్త్యాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. నటి మంచు లక్ష్మి సంక్రాతి పండుగ పర్వదినాన్ని చేనేత దుస్తులను ధరించి జరుపుకున్నారు. ఈ సందర్భంగా చేనేత ప్రచారకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేటీఆర్‌ను అభినందించారు. సంప్రదాయక దుస్తుల్లో తండ్రి మోహన్ బాబు, పాపతో కలిసి దిగిన ఫోటోను మంచు లక్ష్మి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చేనేత పరిశ్రమకు తాము కూడా అండగా ఉంటామంటూ ఇటీవలే నటుడు నాగార్జున కూడా భార్య అమలతో కలిసి చేనేత దుస్తులు ధరించిన ఓ ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. చేనేత దుస్తులు అందంగా ఉండటమే కాకుండా ఎంతో సౌకర్యంగా ఉన్నాయని కింగ్ పేర్కొన్నారు. It's a #handloom sankranti at the #MANCHU's. @KTRTRS appreciate the initiative. pic.twitter.com/ZDKDKS22BN — Lakshmi Manchu (@LakshmiManchu) January 14, 2017 -
సినీతారలకు చేదు అనుభవం
-
సీనీతారలకు చేదు అనుభవం
-
అభిమానుల అత్యుత్సాహం.. వెనుదిరిగిన సినీతారలు
కేపీహెచ్‌బీకాలనీ (హైదరాబాద్): చెన్నై వరద బాధితులకు అండగా విరాళాలను సేకరించేందుకు ఆదివారం కూకట్పల్లి సుజనా ఫోరం మాల్లో ఏర్పాటు చేసిన సినీతారల కార్యక్రమం రసాభాసగా మారింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన అభిమానులతో ఫోరం మాల్ కిక్కిరిసిపోయి తొక్కిసలాటకు దారితీసింది. సీనీతారలు కాజల్, రానా, అల్లరి నరేష్, నిఖిల్, మంచు లక్ష్మి, తేజశ్వి తదితరులకు చేదు అనుభవం ఎదురైంది. సభా వేదిక వద్దకు వచ్చిన హీరో, హీరోయిన్లను తాకేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో ముందుకు చొచ్చుకురావడం, సెల్ఫోన్లతో చిత్రీకరించేందుకు పోటీపడటంతో పరిస్థితి ఒక్కసారిగా తొక్కిసలాటకు దారితీసింది. దీంతో పలువురు అభిమానులు కిందపడిపోయారు. కార్యక్రమ నిర్వాహాకులు, పోలీసులు, బౌన్సర్లు అభిమానులను కట్టడి చేసేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో సినీతారలు పక్కనే ఉన్న స్టార్‌బక్స్ లోకి వెళ్లి కొద్దిసేపు సేదతీరారు. అనంతరం అక్కడి నుంచి నిష్ర్కమించారు. కాగా, చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని సినీ తారలు కాజల్, అల్లరి నరేష్, రానా, మంచులక్ష్మి, తేజస్విలు కోరారు. తమిళనాడులో మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు, వరదలు ముంచెత్తి చెన్నై నగరం నీటమునిగిందని, అక్కడి ప్రజలలో తెలుగువారు కూడా ఉన్నారని, ప్రజలను ఆదుకునేందుకు మనమంతా సహకారం అందించాల్సిన అవసరం ఉందని వారు అన్నారు.