
గరుడ వేగ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న మూవీ టీం ప్రస్తుతం సక్సెస్‌ను ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. పబ్లిక్ ఈవెంట్స్‌లో పాల్గొంటూ తమ ఆనందాన్ని అందరితో పంచుకుంటున్నారు. తాజాగా క్రిస్టమస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్‌లో హీరో సునీల్‌తో పాటు గరుడ వేగ టీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ ఆసక్తిరమైన విషయాన్ని వెల్లడించారు. గరుడ వేగ సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన సునీల్. గతంలో తన కూతురికి ఆరోగ్యం బాగోలేని సమయంలో రాజశేఖర్ వైద్యం చేసి కాపాడారన్నారు. అందుకే సినీ హీరోగానే కాక వ్యక్తిగతంగానూ ఆయనంటే నాకు ఎంతో అభిమానమన్నారు.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన గరుడ వేగ ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో పూజ కుమార్, శ్రద్దాదాస్, కిశోర్, చరణ్ దీప్, రవివర్మలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. చాలాకాలం తరువాత రాజశేఖర్‌కు దక్కిన విజయం కావటంతో యూనిట్ సభ్యులు ఈ సక్సెస్‌ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment